కిరీటంలాగా తలపాగా
చురుకైన కళ్లు!
జ్ఞాన విజ్ఞాన కాంతులు
కంటిజోడులోంచి కిరణాలుగా!
చిరునవ్వుతో మాటాడని మల్లెమొగ్గ!
అసలుసిసలు తెలుగువాడు!
పెరిగింది తమిళనాడు!
రాయబారి ఉపాధ్యక్షుడు రెండో
రాష్ట్రపతిగా వన్నెతెచ్చె పదవికి!
ఉపాధ్యాయ సౌధానికి మేస్త్రీ!
విద్యారంగం ఉన్నతికి ప్రగతిబాట వేసి విద్యా సుమాలు పూయించిన తోటమాలి!
ప్రతివారు డాక్టర్ ఇంజనీరు సైంటిస్ట్ క్రికెట్ సినిమా టి.వి.లో
రాణించాలని ఆశిస్తారు!
టీచర్ మాటే కరువు!
ఏచదువుకైనా విత్తునాటేది మొలకల పోషణ చేసేది
అధ్యాపకులు అన్న మాట
అమ్మా నాన్నలు పిల్లలు మరిచారు!
మూతబడనికళ్లు శ్రమించే ఒళ్లు! నిస్వార్థ జీవి!
చెరుకుగడలా పిల్లలు పేరెంట్స్
ప్రైవేటు యాజమాన్యం మధ్య
నలిగే బడుగు జీవి!
కరోనాకాటుతో విలవిలలాడారు!
అడకత్తెరలో పోకచెక్క!
అరిగిపోతున్న గంధపు చెక్క!
అయినా గురువు స్థానం
జీవితమంతాశిష్యుడిగా నేర్చుకోటమే!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి