నాశబోయిన నరసింహ(నాన)కు జాతీయ వైద్య రత్న పురస్కారం:

 నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన కవి,రచయిత,ఆరోగ్య పర్యవేక్షకులు నాశబోయిన నరసింహ(నాన)"గుర్రం జాషువా జాతీయ వైద్యరత్న" పురస్కారం అందుకున్నారు. హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం హైద్రాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగిన గుర్రం జాషువా జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ కవి,గాయకుడు, ఏమ్మెల్సీ గోరేటి వెంకన్న,ప్రముఖ కవి,సీనియర్ జర్నలిస్ట్ కళారత్న బిక్కి కృష్ణ,ఆంధ్రప్రభ ఎడిటర్ వై.ఎస్.ఆర్.శర్మ,మల్కాజిగిరి కోర్టు న్యాయమూర్తులు బూర్గుల మధుసూదన్,సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ మొదలైన ప్రముఖుల చేతుల మీదుగా నరసింహకు 'జాతీయ వైద్యరత్న అవార్డు ప్రదానం చేసి మెమెంటో,శాలువాతో ఘనంగా సన్మానించారు.
    నరసింహ ప్రస్తుతం యాదాద్రి జిల్లా వేముల కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో గ్రామీణ ప్రజలను చైతన్యపరచడం,హోం క్వారంటైన్ లో వున్న కరోనా రోగులకు సేవలందించడం, కరోనా వ్యాక్సినేషన్ ద్వారా వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వివిధ వైద్యారోగ్య విశిష్ట సేవలకు గుర్తింపుగా,ప్రవృత్తి పరంగా సమాజ హితం కాంక్షించే సామాజిక చైతన్య రచనలకు గాను హోప్ స్వచ్ఛంద సేవా సమితి,సింధు ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు దైద వెంకన్న గారు తనకు ఈపురస్కారం ప్రదానం చేసినట్లు చెప్పారు.మరోవైపు జాతీయ వైద్యరత్న అవార్డు అందుకోవడం పట్ల వైద్యారోగ్యశాఖ సహోద్యోగులు,సాహితీ మిత్రులు, బంధువులు ఆయనను అభినందించారు.
కామెంట్‌లు
ZPHS CRBR DUPPALLY mandal Valigonda. చెప్పారు…
నాన గారికి హృదయపూర్వక అభినందనలు,శుభాభినందనలు 👌👏👏