చిత్ర పద్యాలు :---ఎం. వి. ఉమాదేవి
తేట గీతి 

ఎంత దృఢమైన దీక్షతో నెరుక గల్గి 
చదువు సాగించె బాలుండు చక్కగాను
తండ్రి కష్టము నెరిగిన తరుణమందు 
పంట నమ్ముచు వ్రాయగా  పాఠములను 

భాను తాపoబు  తనకేమి భయముగలదు  
చలిది యన్నము దినివచ్చె చక్కగాను 
పేద రైతుల వణికించు పెద్ద ఋణము 
తీర్చి నప్పుడు మనసార తేనెధార!


కామెంట్‌లు