నాన్న కన్న మిన్న ఎన్న సున్న:- ...డాక్టర్ బెజ్జంకి.
 నా అన్న వాడు నాన్న
నా అనేవాడే నాన్న
నాన్నకంటే మిన్న సున్నా
అన్నం తిన్నా తినకున్నా
కన్నసంతుకోసం కూడబెట్టేవాడు
కన్నది అమ్మే 
పెంచేది అమ్మే
వండి తినిపించేది అమ్మే
లాలించేది అమ్మే
లాలపోసేది అమ్మే
అందుకు కావలసిన 
ఒనరులు కూర్చేందుకు
అస్తులు విరిగేలా కష్టపడి
ఆస్తులు కూడబెట్టేది నాన్నే

అమ్మను ప్రేమిస్తూ
అమ్మను గౌలవిస్తూ
అమ్మ చుట్టూ తిరుగుతూ
నాన్నను నిర్లక్ష్యం చేసినా
నీరసించక  నిలువెత్తు దీపమై
వెలుగు నిచ్చేవాడు నాన్న.
నాన్న సములులేరు నరలోక మందున.
  


కామెంట్‌లు