"గ "గుణింత గేయం:-మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 గణగణ గంట మ్రోగింది
గాలి కబుర్లు మానండి
గిలక బండి వీడండి
గీతాలాపన చేయండి
గుడియే బడియని తలవండి
గూరణము తో ఉండండి
గృహమున సాధన చేయండి
"గౄ " ఉచ్చారణ పలకండి
గెలవాలని  చదవండి
గేయములెన్నొ  రాయండి
గైకొను పెద్దల సలహాలండి
గొడుగై  మీరు నిలవాలండి
గోముగ  వృద్ధిని  పొందండి
గౌరవముగా  బ్రతకండి
గంగా నదిలా ప్రవహించండి .
కామెంట్‌లు
అమ్మా !

మీరు వ్రాసింది బాగుంది. మీరు తెలుగు భాషోపాధ్యాయులు గాబట్టి మరిన్ని గేయాలు తో బాటు పద్యాలు కూడ సులభ మైన రీతిలో పిల్లల కొరకై వ్రాయండి. శుభమస్తు..

కవిశ్రీ సత్తిబాబు
హైదరాబాద్
అమ్మా .. మీరు వ్రాసిన గేయము బాగుంది. మీరు భాషోపాధ్యాయులు గాబట్టి గేయాలుతో బాటు సులభశైలిలో తెలుగు పద్యాలు కూడ పిల్లలకొరకై వ్రాయండి. వారిచేత వ్రాయించే ప్రయత్నము చేయండి... శుభమస్తు
అమ్మా .. మీరు వ్రాసిన గేయము బాగుంది. మీరు భాషోపాధ్యాయులు గాబట్టి గేయాలుతో బాటు సులభశైలిలో తెలుగు పద్యాలు కూడ పిల్లలకొరకై వ్రాయండి. వారిచేత వ్రాయించే ప్రయత్నము చేయండి... శుభమస్తు