హనుమను కనుమా:- డా.. కందేపి రాణీప్రసాద్.

పవనసుత హనుమ ! పావన సుధ హనుమ !
ప్రణతి ప్రణఅ హనుమ ! పబ్బతి పబ్బతి హనుమ !

అనంత బలశాలి హనుమ ! అజేయ శక్తి శాలి హనుమ
అపార విజ్ఞాని హనుమ ! అధ్బుత బంధామ హనుమ

సీతాన్వేషణ కై సముద్రాన్నే లంఘించిన హనుమ
సీత జాడ కనుగొని లంకాదహనం చేసిన హనుమ

మూర్చిల్లిన లక్ష్మణునికై సంజీవనినేతెచ్చిన హనుమ
మువ్వురిని హృదయంలో ప్రతిష్టించుకున్న హనుమ

ప్రకృతి అంత స్వామినే దర్శించిన పుణ్యమూర్తి హనుమ
ప్రతి అణువణువులో రామనామాన్ని నింపిన హనుమ

రాముడిపై దృడ విశ్వాసమే తన బలమన్న హనుమ
రాముడొక్కడే దైవం, రామనామమే మంత్రమన్న హనుమ
కామెంట్‌లు