*మా అమ్మాయి*:-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

 గంధము మెడకు రాసుకుని
కంటికి కాటుక పెట్టుకుని
చక్కగ పౌడర్ వేసుకొని
కుంకుమ పెట్టుకుని 
తలను చక్కగా దువ్వుకొని
రెండు జడలు వేసుకుని 
బుగ్గన చుక్క పెట్టుకుని
చేతికి గాజులు వేసుకుని
కొత్త గౌను వేసుకుని
మెడలో చైను వేసుకుని 
చేతికి గాజులు వేసుకుని
చెవికి రింగులు పెట్టుకుని 
కాల్లకి పట్టీలు పెట్టుకొని 
తయారైనది అమ్మాయి
ఎవరో కాదు మా అమ్మాయి.
కామెంట్‌లు