చిగురించిన హృదయం*..!!:-రావాడ కృష్ణ కుమారి ( రాకుమారి)సాలూరు

  మీ అజ్ఞానంతో నన్ను 
మొదలంటూ నరికినా
నా హృదయస్పందన
 మీకు నీడను ఇవ్వాలన్నదే... 
కరుణించిన మబ్బు నాపై చిలికిన 
అమృత వర్ష హర్ష జలముతో
నా మేను పచ్చని చిగురుల
నూతన జీవన పందిరులతో 
కలకలలాడుతూ 
మీకోసం వటుడు  
ఇంతింతై అన్నట్టు
అంబరమంత ఎత్తు ఎదుగుతా....!
భావితరానికి మిగులుతా...
మిత్రమా..నా విలువ తెలుసుకొని
మసలుకో..!!

కామెంట్‌లు