*ప్రేమ!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 16.ప్రేమ!
      ఏదైనా నేరమా?
      మరి భయమెందుకు!
      నడు ముందుకు!
       గెలిచేందుకు!
17.ప్రేమ!
      వన్నె తగ్గని సౌందర్యం!
      విస్తరించే సౌరభం!
      వినపడే సుశబ్దం!
      ఆవరించే నిశ్శబ్దం!
18.ప్రేమ !
   మరులు కాదు!మరలి పోవు!
    సిరులు కాదు! తరలి పోవు!
     తలచిన పిలుచును!
     నిలిచిన గెలుచును!
19.ప్రేమ!
      మారని సంతకం!
      తెరిచిన పుస్తకం!
      ప్రేమించడం జీవించడం!
      జీవించడం ప్రేమించడం!
20. ప్రేమ!
       ఫలిస్తే వైభవం!
       వికటిస్తే వైరాగ్యం!
       రమిస్తే రసానందం!
       విరమిస్తే వేదాంతం!
           (కొనసాగింపు)

కామెంట్‌లు
Unknown చెప్పారు…
ప్రేమా ! నీ పగ్గాలను సవరించ గలమా !