*"హైదరాబాద్లో ఘటనపై నిరసన *

  హైదరాబాద్లో  ఆరేళ్ల పసిబాలిక చైత్రపై అత్యాచార సంఘటన సిగ్గుచేటనీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలుతీసుకోవాలని *తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసరవేణి పర్శరాములు* అన్నారు.
మంగళ వారం  తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో  యెల్లారెడ్డిపేటలో *"ఆడపిల్లలలను రక్షిద్దాం! ఆడపిల్లలలను చదివిద్దాం!! ఆడవారిని గౌరవిద్దాం!!!* "అనే స్లోగన్లతో నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్షించారు. *బాలసాహిత్యవేత్త డాక్టర్ వాసరవేణి పర్శరాములు* మాట్లాడుతూ అత్యాచార,హత్యల్లాంటి నేరాలు పెరుగడం సిగ్గుచేటనీ నిర్భయలాంటి చట్టాలు, ఫోక్సోలాంటి చట్టాలున్న ఇటువంటి సంఘటనలకు పాల్పడటం ప్రశాంత సమాజానికి,దేశానికి ప్రమాదమనీ హెచ్చరించారు. *బాలల హక్కులను కాపాడాలన్నారు* . ప్రభుత్వాలు *అధ్యనకమిటీలు వేసి ఇటువంటి సంఘటనలకు గల మూలలను వెతికి కూకటి వేర్లతో పెకిలించాలనీ* సీరియస్గా తీసుకుని చర్యలు చేపట్టాలని అన్నారు.
  కార్యక్రమంలో *తెవిరసం జిల్లా కార్యదర్శి దుంపెన రమేశ్, మహమ్మద్ దస్తగీర్ ,ముష్కం దత్తాద్రిగౌడ్,గజభీంకార్ అజయ్, దుంపెన వరలక్ష్మీ, స్రవంతి, భూమరాజం,హరికృష్ణ,శ్రీనివాస్* తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు