మంచి మాట:---మచ్చ అనురాధ--తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

1.ఆటవెలది.
మాట మంచిదైన మన చుట్టు నలుగురు,
కాని యెడల రారు కాంచమమను,
మాట తీరు చూసి మనిషిని గొలుతురు,
మాట భూషణమ్మె మహిన మిన్న.

2.ఆటవెలది.

గద్దె మిద్దెలెంతొ ఘనముగా యున్నను,
వెడలి పోవు నాడు వెంటరావు ,
తనువునున్న యపుడె దానధర్మము జేయ,
పుణ్యమెంతొ కలుగు పుడమి నందు.

3.తేటగీతి.

చూడ నీలోన నాలోన జ్యోతి యొకటె,
వెలుగు చుండును దేదీప్య విభవ కాంతి,
నీవు నేను వేరనియెడి నీతివీడ,
మనసు వికసించి మదినిండ మమత లూరు.

4.ఆటవెలది.

దివ్య వెలిగె శివము దేహమందు తొలుగ
శవమునందురిలన శంక వలదు,
శౌర్య భారతి చైతన్య శకటమిదియె,
దీపమెలిగించు మదిలోన దిగులు లేక.

కామెంట్‌లు