*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం ద- ఒత్తు*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 బంగ్లాలో ఉన్నాడు
బబ్లూ అనే బాలుడు
పండ్లు రోజు తింటాడు
గుడ్లంటే ఇష్టమంటాడు
శుక్లపక్ష చంద్రునిలా
చక్కగా పెరుగుతున్నాడు
చెట్లపాదులు చేస్తుంటాడు
మొక్కల్ని పెంచుతుంటాడు
ఎడ్లబండెక్కి అప్పుడప్పుడు
పొలానికి వెళుతుంటాడు
క్రమం తప్పక బడికి కెళ్ళి
ఆహ్లాదంగా చదువుతుంటాడు
క్లిష్టమైన లెక్కలను చేసి
భేష్ అనిపించుకుంటాడు

కామెంట్‌లు