చిన్న చిన్న చిట్కాలు :: పి . కమలాకర్ రావు

 1. శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలి, వాపు వస్తే, ఆవాలను నీటిలో నాన బెట్టి ముద్దగానూరి లేపనంగా పూస్తే వాపులు తగ్గి పోతాయి.
2. బెణుకులకు మందు.
 వెల్లుల్లిని చితగొట్టి కొద్దిగా ఉప్పు కలిపి పూతగా పూస్తే బెణుకులు త్వరగా తగ్గి పోతాయి.
3. నీరసానికి మందు.
 మెంతులను కొద్దిగా వేయించి పొడిగా చేసి కొద్దిగా తేనె కలిపి త్రాగితే నీరసం వెంటనే తగ్గిపోతుంది.
4.  నోటి దుర్వాసనకు  కడుపులో పుళ్ళు కారణం కావచ్చు. వేయించిన సోంపు ను భోజనము తరువాత నోట్లో వేసుకొని నమిలి మింగాలి. దుర్వాసన రాదు. కడుపులో పుళ్ళు తగ్గిపోతాయి,
5. మంచి నిద్ర కోసం.
 మల్లెపూలను బాగా కడిగి నీళ్ళల్లో వేసి, గస గసాలు మరియు తాటి బెల్లం కలిపి బాగా మరిగించి చల్లార్చి త్రాగితే, మంచి నిద్ర పడుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.
కామెంట్‌లు