కంటికి కనిపించిందంతా నిజం కాకపోవచ్చు. మన ఆలోచనా విధానాన్ని బట్టి కూడా అవి ఒక్కోసారి ఒకే రకంగా కనపడుతూ ఉంటాయి.
ఒక అమ్మాయి గురించి ఒక విషయంలో పొరపాటుగా నేను వేసిన అంచనా ఎంత పెద్ద తప్పో , ఆ తర్వాత తెలిసి చాలా బాధపడ్డాను. అదికూడా నాతప్పుకాకపోవచ్చు. మా కాలేజీ లో నాకు జరిగిన అనుభవం ఒకటి చెప్తాను. జీవితంలో, ఎవరు ,ఎప్పుడు, ఎందుకు కలుస్తారో ఆ దేవుడికే తెలియాలి. అసలు నిజం చెప్పాలంటే ఇంటర్మీడియట్ లో రెండు జడ ల అమ్మాయిని కలవడమే నేను ఊహించని ఘటన. అది భవిష్యత్తులో నాకు జరగబోయే పెద్ద మలుపు కి కారణం కూడా.
నాగార్జున సాగర్ జూనియర్ కాలేజీకి మంచి పేరు ఉండేది. ఆ కాలేజీలో విద్య ,వాతావరణం ఉపాధ్యాయుల బోధనా ప్రమాణాలు చాలా ఉన్నత శ్రేణిలో ఉండేవి.
పదవ తరగతి పరీక్షలలో నేను భువనగిరి తాలూకా మొత్తం లో మొదటి ర్యాంకు లో ఉత్తీర్ణుడయ్యాను. మా ఊర్లో ,నానమ్మ, బాబాయ్ సంరక్షణలో నేను పదవ తరగతి పూర్తి చేసిన తర్వాత కాలేజీ చదువు ఎలా, ఎక్కడ కొనసాగించాలి ?అన్నది పెద్ద సమస్యగా మారింది. మాది దాదాపుగా ఉమ్మడి కుటుంబం అనే చెప్పాలి ,కాకపోతే మా నాన్నగారు, బాబాయిలు ఉద్యోగరీత్యా వేర్వేరు ఊర్లలో ఉండేవారు. నన్ను మా నానమ్మ తనతో బాటే అందరికంటే చిన్నవారైన కృష్ణ బాబాయ్ గారి దగ్గర పెంచింది.
ఆ సమయంలో నాగార్జున సాగర్ లో ఉద్యోగం చేస్తున్న రెండవ బాబాయ్ రంగనాథ చారి గారు,నన్ను నాగార్జునసాగర్లో చదివించడానికి తనంతట తానుగా ముందుకు వచ్చి నాగార్జునసాగర్ తీసుకెళ్ళి అక్కడ జూనియరు కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కల్పించారు.
నేను మొదటి సంవత్సరం కాలేజీ కి వెళ్ళే సరికి అప్పటికే క్లాసులు మొదలుపెట్టి పదిహేను రోజులు దాటింది. నా ఆలస్యానికి
కారణం కాలేజీ ప్రవేశ రుసుము ఎనభై రూపాయలు అనే చెప్పాలి. సమయానికి అది కట్టే వెసులుబాటు మా బాబాయ్ కి లేక పోవటం మూలాన అవి తన పెద్దన్నయ్య దగ్గర తీసుకొని కట్టడం జరిగింది. ఆ రోజుల్లో అది కాస్త పెద్ద మొత్తం అనే చెప్పాలి . ఎందుకంటే మా బాబాయి మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ సంపాదించే జీతం నెలకు దాదాపుగా నాలుగువందల రూపాయలు మాత్రమే!. నాకు కాలేజీ ఫీజులో ఎటువంటి రాయితీ కి అర్హత ఉండేది కాదు. అది కూడా నాకు కాస్త చిరాకు కలిగించిందని చెప్పాలి. మొదటిసారిగా జీవితంలో నాకు అనిపించింది, ఫీజులో రాయితీలు కులాలను బట్టి కాకుండా ఆర్థిక అసమానతలను బట్టి ఇవ్వాలి అని. నా ఫీజు విషయంలో మా ఇద్దరు బాబాయ్ లకు కలిగిన మనస్పర్ధలు, వారి ఆర్థిక ఇబ్బందులు నన్ను అలా ఆలోచింపజేశాయి.
మా కాలేజీలో చదివించే విధివిధానాలు మరియు ప్రణాళికలు వాటి ఆచరణ చాలా అద్భుతంగా ఉండేది. ఇక్కడ కో-ఎడ్యుకేషన్ అయినప్పటికీ ఏ విద్యార్థి కూడా అసభ్యకరంగా ప్రవర్తించే వాడు కాదు.
కానీ వయసుతోపాటు అప్పుడప్పుడే వికసిస్తున్న మనసుకి అక్కడ ఉన్న ప్రతి అమ్మాయిఏదోవిధంగా ఆకర్షణీయంగా కనిపించేది .
ప్రతి అమ్మాయిలో ఒక అందం తొణికిస లాడేది. మా ఒక్క క్లాసులోనే దాదాపుగా పదిహేనుమంది అమ్మాయిలు ఉండేవారు. అందరూ కూడా చదువులో హేమాహేమీలు. వారందరిలో రెండు జడల అమ్మాయి కూడా చదువులో చాలా తెలివైనది . నేను కూర్చున్న సీట్లో నుంచి కాస్త ముందు వైపు ప్రక్కగా ఎప్పుడూ కూర్చునేది. పాఠం జరుగుతున్నంతసేపు తనను కూడా చూడటానికి వీలుగా ఉండే ప్రదేశాన్ని నేను ఎన్నిక చేసుకుని అక్కడ కూర్చునే వాడిని. ఎందుకో గానీ ఆ అమ్మాయి ,అందంగా, చాలా ఆకర్షణీయంగా, కనిపించేది . క్లాసులో పాఠాలు సీరియస్ గా జరుగుతున్నంతసేపు అప్పుడప్పుడు అమ్మాయిని అలా చూస్తూ ఉండేవాడిని. చూస్తున్నంత సేపు ఇంకా చూడాలని అనిపించేది. ఒత్తుగా ఉన్న రెండు జడలతో మంచి ఆరోగ్యంతో నిండుగా ఉండేది. నవ్వుతూ ఉంటే ఇంకా ఆకర్షణీయంగా ఉండేది. ఆ నవ్వు చూస్తూ , నన్ను నేను మరచి పోయే వాడిని. కారణం తెలియదు కానీ ,తనను చూస్తున్నంత సేపు నాకొక అనిర్వచనీయమైన అనుభూతి కలిగేది అన్నది మాత్రం నిజం . ఆ అమ్మాయి నాన్నగారు 'తాసిల్దార్ 'అని కొందరు తోటి విద్యార్థులు అనుకుంటుండగా విన్నాను. 'అబ్బో ! తాసిల్దార్ గారి అమ్మాయి !! 'అని నవ్వుకున్నాను. 'అయితే నా లాగా కాదు , మంచి డబ్బు , తాహతు గల అమ్మాయి అన్న మాట 'అనుకున్నాను.
నాగార్జునసాగర్ డ్యాం తలుపులు తీసి నీటిని వదిలినప్పుడు ఆ జలపాతం హోరు ఊరంతా విన పడేది. రెండు జడల ఆ అమ్మాయి కాలేజీ నడవాలో ,గలగలా నవ్వుతూ వస్తుంటే, బ్యాక్ గ్రౌండ్ లో ఆ జలపాతపు హోరు సంగీతంలా సరిగ్గా ఆ దృశ్యానికి సరిపోయి ,ఇంకా ఎంతో అందంగా, రమణీయంగా ,కళాత్మకంగా కనిపించేది. ఆ సమయంలో నాకు ఉండే ఆర్థిక ఇబ్బందులు, మా కుటుంబ పరిస్థితుల లో కూడా ఇటువంటి ఆలోచనలు రావడం చాలా విచిత్రమే!' అయినా...
ఆ నేరం నాది కాదు..నావయసుది!'అని సరిపెట్టుకున్నాను.
ఆ రోజు కాలేజీ మెట్లు ఎక్కి క్లాస్ రూమ్ వేపు వెళుతుండగా ప్రిన్సిపాల్ రూమ్ ముందు విద్యార్థులు చేతిలో ఏవో ఫార్మ్స్ పట్టుకుని నిలబడి ఉండటం చూసాను . కుతూహలాన్ని ఆపుకోలేక వెళ్లి అక్కడ నిలబడ్డ ఒక విద్యార్థిని మెల్లిగా అడిగాను " ఏంటి ఇక్కడ ? ఎం చేస్తున్నారు?" అని.
"కాలేజీ ఫీజు కన్సెషన్ కొరకు అప్లికేషన్ ఇస్తున్నాం. ఈ రోజు ఆఖరు తేదీ " అని సమాధానం చెప్పాడు.
"మరి నాకు కూడ ఇస్తారా?" అని అడిగాను.
"వెనకబడిన తరగతులకు , బీదవారికి ఇస్తారు,దాని కొరకు సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలి" అని చెప్పాడు.
'సరేలే, ఇవేవి మనకు రావు కానీ ,'అని వెనక్కు వస్తూండగా ఆ రూమ్ లో నుండి ఆ అమ్మాయి వస్తూ కనిపించింది. ఎప్పటిలా నవ్వుతూ, గల గలా మాట్లాడుతూ ఇంకొక అమ్మాయి తో ఫీజు కన్సెషన్ గురించి చెప్తూ వస్తోంది. తనను చూస్తూ నేను నిలబడిపోయాను. సముద్రం లో అలల లాగ నా మనసు ఎగిరి పడటం నాకు తెలుస్తోంది. తాను క్లాస్ రూమ్ లోకి వెళ్లేంత వరకు నా చూపులు తన వెంటే వున్నాయి.
అప్పుడు నాకు పెద్ద సందేహం మొదలయ్యింది.' ఈ అమ్మాయి తండ్రి పెద్ద ఆఫీసర్ కదా! అలాంటప్పుడు తనకు ఈ ఫీజు లో రాయితీ ఎందుకు అసలు?. ఈ విధంగా ప్రభుత్వ సహాయాన్ని దుర్వినియోగం చేస్తూ అది అపాత్ర దానం కావటం ఎంత వరకు సబబు', అనే ఆలోచన నాలో అసహనాన్ని రేకెత్తించింది . అంతవరకు ఆ అమ్మాయి మీద నాకున్న
మధుర భావన కాస్త తగ్గింది. ఆ రోజు నుండి గమనిస్తూ ఉంటే తాను ప్రతి రోజూ వేసిన డ్రెస్ మళ్ళీ వేసుకోకుండా రావటం గమనించాను. 'బాగానే ఉందిగా !మరి ఈ ఫీజు కన్సెషన్ కథ మాత్రం బావో లేదు. దాని కొరకు అప్లై చెయ్యకుండా ఉండాల్సింది. ఇలా డబ్బున్న వాళ్లు వాటిని వాడుకోకుండా ఉంటే అవి నిజంగా అవసరం వుండే కష్ట జీవులకు దక్కుతాయి కదా !'అని పలు మార్లు ఆలోచించాను.
ఆ అమ్మాయిని చూస్తుంటే, 'పుడితే ఇలా డబ్బులు బాగా వుండే ఇంట్లో పుట్టాలి 'అని పించేది .మరి కొన్ని సార్లు అసూయగా కూడా ఉండేది.
అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నా మెదడు ను,తొలుస్తున్న ప్రశ్న ను, నా తో కాస్త సన్నిహితంగా మసలే, పక్క న కూర్చునే, సుబ్బారావు ను ఉండబట్ట లేక అడిగా " అసలు ఈ అమ్మాయి కి ఎం తక్కువని ఫీజు కన్సెషన్ తీసుకుంది "అని.
" ఎందుకు తీసుకోకూడదు ?" అన్నాడు.
" వాళ్ళ నాన్నగారు పెద్ద ఆఫీసర్ కదా?అలాంటప్పుడు ఇంకా అవన్నీ ఎందుకు?" అని సూటిగా అడిగా .
"అది నిజమే. కానీ వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు !. పాపం వారిది పెద్ద కుటుంబం , వాళ్ళు మొత్తం ఎనిమిది మంది అక్క చెల్లెల్లు. వారి నాన్న గారు ఆకస్మాతుగా పోవటం మూలాన చాలా ఇబ్బందుల్లో వున్నారు,ఒకప్పుడు పెద్ద ఇంట్లో వుండే వారు ప్రస్తుతం చిన్న ఇంట్లోకి మారి పోయారు." అన్నాడు.
అది విని నా తల తిరిగి పోయింది. కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. హృదయం లో ఎదో తెలీని బాధ మొదలు అయింది. ఇది నేను అసలు ఏ మాత్రం ఊహించని విషయం. రెండు కణతలు నొక్కు కున్నాను, చిన్నగా తల పోటు మొదలయ్యింది. ఆ తర్వాత తను కనిపించినప్పుడల్లా ,ఎన్నో రోజులు నా మనసు ఎంతో కలత చెందేది. అప్పటినుండి ఆ అమ్మాయిని
చూసినప్పుడు నాకు మంచి భావన కలగటమే కాకుండా ఇంకా తాను నాకు సన్నిహితంగా కూడా అనిపించేది. అంత వరకు 'ఈ లోకం లో నేను మాత్రమే చాలా కష్టాలు పడుతున్నాను ఇక మిగిలిన వాళ్ళు హాయిగా వున్నారు' అని స్వయం సానుభూతి పొందే వాడిని. అదెంత పొరపాటో తర్వాత అనుభవం లోకి వచ్చింది.
తమ కుటుంబ పరిస్థితి అలా ఉన్నప్పటికీ ఆ వయస్సు లో ఎప్పుడు నవ్వుతూ త్రుళ్లుతూ వుండే తన మానసిక దృఢత్వం నన్ను మరింతంగా ఆకట్టుకుంది. కష్టాలను కూడా ఎలా ధైర్యం గా
నవ్వుతూ ఎదుర్కోవాలో ఆచరణ లో పెట్టి చూపించింది. అయితే ఇక్కడ నేను చేసిన మొదటి తప్పు ఏమిటంటే ,
ఆ అమ్మాయి కుటుంబ పరిస్థితులను తెలుసుకోకుండా తన గురించి అపార్థం చేసుకోవటం! అన్నింటికన్నా రెండో పెద్ద తప్పు ఏమిటంటే, పది సంవత్సరాల తర్వాత యుక్తవయస్సులో తనతోనే నా వివాహం జరుగుతుందని ఏమాత్రం ఊహించలేక పోవడం.
***
ఫోటోలో--రచయిత తోశ్రీమతి లీలా శ్యామ్ కుమార్.
అంచనా ..!! >రచన> శ్యామ్ కుమార్.చాగల్ని జా మా బా ద్.*
బోల్తా పడ్డావురోయ్
బుల్ బుల్ బుల్లోడా!!
పడితే పడ్డావు గానీ, మనసు పడిన, మనసున్న మగువని మనువాడి, జీవిత భాగస్వామిని చేసుకున్నావు సుమా! అంత కంటే ఇంకా ఏం కావాలి నీకు శ్యాం ? ఇంకా చిలిపి చేష్టలు తగ్గ లేదోయ్ నీలో..🤣😂
Suspense భరించలేకున్నాం
తరువాత ఏమయింది, ఎట్లా అయింది,
ఎట్లెట్లా అయింది, తొందరగా రాయండి 👌🙏😁
+91 93469 95566: చాలా బాగా రాశారు
మేము, అప్పుడు, మీతో వున్నట్టు, చూసినట్లు అనిపిస్తుంది
మమ్మల్ని, నాగార్జునసాగర్ కు తీసుకొని వెళ్లినందుకు
Thank You 🙏
God bless you and your family. 💐🤝
సమకాలీన పరిసరాల వివరణ కళ్ళకి కట్టినట్టు ఉంది. అవతల అమ్మాయిల మనొభావనలు ఎలా ఉండెవో చెబితే ఇంకా బాగుంటుంది.
సమకాలీన పరిసరాల వివరణ కళ్ళకి కట్టినట్టు ఉంది. అవతల అమ్మాయిల మనొభావనలు ఎలా ఉండెవో చెబితే ఇంకా బాగుంటుంది.
Very nice natural
U discribe only ur bhanava
Should write about her
What she thinks.
Is it ur story
: College class lo leela garini chustunnapudu meelo kaligina bhavalani emantaru@? Adi Prema kada
With love.
A.chandrashekar.
With love.
A.chandrashekar.
ఈ కథ లో రచయిత శ్యాం కుమార్ చాగల్ , నిజామాబాద్ గారు
ఒక వ్యక్తిని బాహ్య రూపం బట్టి అంచనా వేయడం తప్పు అనే విషయాని చాలా చక్కగా చెప్పడం జరిగింది ..
కాలేజ్ నేపధ్యం లో సాగిన ఈ కధలో తన స్వీయ కథ ని చెప్తూ, ఆ రోజుల్లో కాలేజ్ చదువుల కోసం తను ఫీజ్ లు కట్టలేక ఎదుర్కున్న ఇబ్బందులు ..
కులాలని బట్టి కాదు, ఆర్ధిక అసమానతలను పట్టి ఫీజ్ రాయితీలు ఉండాలి అన్న తన అసహనం ..
అన్ని చెప్తూనే ..
ఒకవైపు కాలేజ్ లో తన చదువు బానే సాగుతూనే ఉన్నా ..
ఇంకోవైపు తనకి తెలీకుండానే తానూ అన్యమనస్కం గా గమనించిన ఓ చలాకీ అమ్మాయి ..
తన మనసులో ఏరకం గా అలజడి రేపింది అన్నది చాలా హృద్యం గా చెప్పారు ..
వేసిన డ్రెస్ వేసుకోకుండా వస్తున్న ఆ అమ్మాయి ఓ తహసిల్దారి గారి అమ్మాయి అని తెలిసినపుడు పుడితే అలా, రిచ్ గా పుట్టాలి అని అనిపించేది ..
కాని అనుకోకుండా ఆ అమ్మాయి ని ఒకసారి ప్రిన్సిపాల్ రూమ్ దగ్గర ఫీజు రాయితీ కోసం అప్లికేషను పెడుతుండగా చూసి ఏంటిది అని విచారిస్తే తెలిసిన విషయం వాళ్ళ ఫాదర్ చనిపోయారు
వాళ్ళు పెద్ద ఇంటి నుండి చిన్న ఇంటికి మారి పోయారని ..
పరిస్థుతులు తారుమారు అయ్యాయని ..
పరిస్థితులు మారినా .. కానీ
వ్యక్తి గా తను మారలేదు
తన వ్యక్తిత్వం మారలేదు ..
అది తన మనసుకు ఇంకా నచ్చింది ..
ఈ ప్రపంచం లో నావే కస్టాలు అనుకున్న నా భావనను తొలగించి చిరునవ్వు తోడుంటే ఏది కష్టం కాదని నాకు తెలిపింది ఆ అమ్మాయి ..
మొదట అంచనా తప్పయినా ..
తర్వాత ఆ అమ్మయి మీద తన అంచనా తప్పలేదు ..
తను ఉంటె ఏ కష్టం రాదనీ ..
వచ్చినా కష్టం కూడా చిన్నబోతుందని ..
*ఈ కథలో కొసమెరుపు ఏంటంటే అప్పటి ఆ తహసిల్దారిగారి అమ్మాయే .. మన కధలో హీరో , ఈ కథా రచయిత అయిన శ్యాం గారి భార్య లీలా ..*
*Made for each other..*
*మీ ఇద్దరి ప్రేమ .. మీ రచనలు*
ఇలా కొనసాగుతూనే ఉండాలి ..
కొలను వెంకటేశ్వర రెడ్డి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి