చలాకి పిల్లలు(బాల గేయం):-ఎడ్ల లక్ష్మి సిద్దిపేట

కొంగుచాటు పిల్లలు
ఆకుచాటు పిందెలు
కల్లకపటమెరుగని
చిన్నారి బాలలు !!

ఆడి పాడే పిల్లలు 
అబద్ధాలు చెప్పరు 
సత్యానికి వక్తలు
వారు దైవ సమానులు !!

చిట్టి పొట్టి పిల్లలు
చిరునవ్వుల దివ్వెలు
పాలబుగ్గల పాపలు 
పసిడి కాంతుల బుడతలు !!

చలాకి పిల్లలు 
చందమామ కాంతిలో
అందమైన ఆటలు
చుక్కలాంటి మెరుపులు !!

కామెంట్‌లు