Ø ఆనందం ఉందంటే అన్నీ బాగున్నాయని అర్ధం కాదు, బాగా లేని వాటికి అతీతంగా చూడాలని నిర్ణయించుకున్నావని అర్ధం.
Ø తెలిసింది తక్కువైనా అర్ధం చేసుకొనేది ఎక్కువ గలవారు తెలివైన వాళ్ళు. జేమ్స్ స్టిపెక్
Ø నీ గతాన్ని అర్ధం చేసుకొని, నీ భవిష్యత్తుపై నమ్మకం ఉంచి, ఉన్నది ఉన్నట్లుగా నిన్ను ఆమోదించేవాడు నీ మిత్రుడు.
Ø నీ చిరునవ్వును మాత్రమే అర్ధం చేసుకొనే మిత్రునికంటే నీ కన్నీళ్లను కూడా అర్ధం చేసుకునే మిత్రుడే విలువైన వాడు.
Ø పరిశోధన చాలామంచిపదం.దాని అర్ధం స్పష్టంగా ఉంటుంది, ఫలితాలు విపరీతంగా ఉంటే తిరిగివెతుకు.రీ సెర్చి research.
Ø భావవ్యక్తీకరణలో ముఖ్యమైనది చెప్పనిమాటలో భావం తెలుసుకోగలగటం.
Ø ముప్ఫయ్ ఏళ్లలోపు వయసులో పుస్తకాలను ప్రేమించలేనివ్యక్తి తరువాత కూడా ప్రేమించలేడు, అర్ధం చేసుకోలేడు. క్లేరన్ డాన్
Ø వినటం సోమరిగా చేసే పని. శ్రద్ధగా వినటం ఒక మనో కృత్యం. ఇది మాటల అర్ధం తెలుసుకొని విషయాన్ని అర్ధం చేసుకోవటం.
Ø స్నేహాన్ని వివరించటం కష్టం. చదువుకుంటే తెలిసేది కాదు.స్నేహానికి అర్ధం తెలియకపోతే నువ్వు ఏమీ నేర్చుకోనట్లే. మహమ్మద్ ఆలీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి