సూక్తులు- విషయం -- అన్నం--సేకరణ- పెద్ది సాంబశివరావు,peddissrgnt@gmail.com

-ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడానికి మించిన దైవప్రార్థన లేదు. మదర్ థెరిసా

-ఆకు యిస్తే అన్నం పెట్టినంత పుణ్యం.

-ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?

-ఆలుమగల కలహం అన్నం తినేదాకానే.

-గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరినట్లు.

-చెడిపోయిన అన్నం వలె ఈనాటి కులవ్యవస్థ పాడైపోయింది. శంకరాచార్య

-నిండిన కడుపుకు అన్నం,  బట్టతలకు నూనె అన్నట్లు.

-నీతిని అధిగమించని వాడు, దాత, అన్నదాత, హింసచేయని వాడు, చేసినమేలు మరువని వాడు, స్వర్గం పొందగలరు.

-రైతు దున్నితేనే రాజులకు అన్నం.

-వండని అన్నం, వడకని బట్ట.

-సామాన్య ప్రజలకు పట్టెడుఅన్నం పెట్టి, వారి మంచిచెడ్డలు గ్రహించనంతవరకు ఎటువంటి గొప్ప రాజకీయాలు ఎందుకూ పనికిరావు.
కామెంట్‌లు