గణపతి (కైతికాలు):-కృష్ణా నాయక్ SA (తెలుగు)ZPHS మల్కారం, ధమ్మపేట

ఓబొజ్జ గణపయ్య
మా వాడ రావయ్యా
మా ఆర్తి నీదయ్యా
నీ పూజ మాదయ్య
మమ్మేల రావయ్యా
మము బ్రోవ నీవయ్య

పార్వతి నందనుడా
పరమేశు పుత్రుడా
పర్వతుని మనవడా
గణపతి నామధేయుడ
మమ్మేల రావయ్యా
మా ఇలవేల్పు నీవయ్య

మారేడు దళముల
నారికేళ జలాదుల
పంచామృతమ్ములతో
అందించు అభిషేకాల
ఘనమైన మా పూజలు
తొలగిపోవ మా విఘ్నాలు

కామెంట్‌లు