"దేశభక్తి"(బాలాగేయం-):-చైతన్య భారతి పిZphs నేరళ్లపల్లి7013264464


బడిలోకి  రండిరా
చదువులన్ని చదవరా
ఆటలెన్నో ఆడరా
ప్రైజులన్ని గెలవరా

కలిసిమెలిసి పాడరా
కదం త్రొక్కి నడువరా
అంతా ఒకటేనని చెప్పరా
మాదే గెలుపని చాటరా

మంచి చెడ్డ ఎరుగరా
మసలుకొని నడువరా
కులం లేదు గిలం లేదు
మతo లేదు గితం లేదు.

నింగికేసి ఎగురరా
హరివిల్లును తాకరా
మల్లె తోటకెళ్లారా
మనసు విప్పి ఆడరా

బంతి తోటకెళ్లారా
బంతులాట ఆడరా
కలం పట్టి రాయరా
కథలెన్నో చదవరా

పదం పట్టి పాడరా
గళమెత్తీ పొగడరా
జెండా పైకెత్తరా
దేశ కీర్తి చాటరా.

కామెంట్‌లు
Unknown చెప్పారు…
చాలా బాగుంది teacher