స్నేహ - మధురిమలు ~~వి.నర్సింహా చారి,భాషోపాధ్యాయులు,ZPHS.శేరిలింగంపల్లి
స్నేహమంటె కరగని కల
స్నేహమంటె విరగని అల
కష్టాలకు జడవ కుండ
నిను కప్పి ఉంచు గొడుగుల!!            

మతమన్నది యేదైనా
కులమన్నది వేరైనా
విడువడనిది చెలిమంటే
రాజైనా, పేదైనా!!

నమ్మకాన్ని యిచ్చు చెలిమి

అమ్మ ప్రేమ పంచు చెలిమి
అనుక్షణం తోడుగా
నాన్నలా కాపాడు చెలిమి!!

మధురమైన బంధము
అజరామర సౌధము
సృష్టిలోన వెలకట్టని
స్నేహమెంతొ మధురము!!

.

కామెంట్‌లు