కందం:
*అనుభవము లేనివిభవము*
*లనుభావ్యకానియాలు నార్యానుమతిన్*
*గనని స్వభావము ధర్మముఁ*
*గొనని సిరియు వ్యర్ధమెన్న గువ్వలచెన్నా!*
తా.:
ఆలోచించి చూస్తే, ఈ భూము మీద మన వద్ద వాడుకోవడానికి పనికి రాకుండా గుట్టలు గుట్టలుగా డబ్బు, బంగారు వున్నా వాటికి విలువ వుండదు. సంసారంలో కలుపుకు పోయే లక్షణము లేని స్త్రీ, భార్యగా వున్నా ఆ కుటుంబానికి సుఖం వుండదు. పదిమందికి ఆదర్శంగా వుండని లక్షణాలతో గడిపే జీవితం లో ఆనందం, సుఖం రెండూ వుండవు. ఎన్నో కోట్ల ధనము వున్నా, తోటి వారి తో పంచుకో లేకపోతే, దాన గుణము లేకుండా వుంటే ఆ ధనము పనికి రానిదే అవుతుంది .....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*ఆనంద కారకుడైన పరబ్రహ్మ స్వరూపం మనకు అంది ఇచ్చిన సంపదను నలుగురికీ పంచి, నలుగురితో కలసిమెలసి వుంటూ, మనవారి ఆనందంలో మన ఆనందం చూసుకుంటూ, వుడాలి. కానీ, ఎల్లప్పుడూ నా బొందో అనుకుంటూ, నేనూ, నా భార్యా, నా పిల్లలు మాత్రమే ప్రపంచం. నేను బాగుంటే చాలు అనుకుంటూ వుండకూడదు. మన వద్ద వున్నది రూపాయి అయినా, అరటి పండైనా ఎదుటి వారి తో పంచుకోవడం లోనే ఆనందం వుంటుంది. మనం ఇచ్చిన అరటి పండు తినడం వల్ల ఎదుటి మనిషి క్షుద్బాధ కొంచెమైనా తీరింది అని తెలిసినప్పుడు మనకు కలిగే ఆనందం వెలకట్టలేనిది. ఇదే పరం. ఇదే పరబ్రహ్మము. ఈ ఆనందం సొతం చేసుకోడానికి అందరూ తాపత్రయ పడాలి.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి