*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౧౩ - 013)
 కందం:
*చెలియలి భాగ్యము రాజ్యం*
*బుల నేలుచు జనుల ద్వేషఁమునజూచుచుఁ గ*
*న్నులమత్తతఁగొన్నాతఁడు*
*కొలనికిఁగాపున్న వాఁడు గువ్వలచెన్నా!*
తా.: 
 భార్య కారణంగా తనకు వచ్చిన రాజ్యాన్ని పాలిస్తూ, తన రాజ్యం లోని ప్రజల మంచి చెడులు పట్టించు కోని రాజు, చెరువుకు కాపలా కాస్తున్న కాపలాదారు వంటి వాడే. ఎందుకంటే, చెరువులలో ఆటు పోటులు, అలలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు రావో కాపలాదారు చెప్పలేడు కదా. .....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*మనకు భగవంతుని ప్రసాదంగా లభించిన తెలివితేటలతో మంచి చెడులను తెలుసుకోగలిగే ప్రయత్నం నిరంతరం మనం చేస్తూ, నలుగురికీ మేలు చేసే మార్గంలో ప్రయాణం చేయాలి.  అలా కాకుండా, వేరెవరి తెలివిమీదనో ఆదారపడి జీవితాన్ని గడిపేస్తే, ఆ మనిషి జీవికకు ఏవిధమైన అర్థం, పరమార్థం వుండదు.  పరమాత్మ కూడా ఈ విధమైన జీవనాన్ని మెచ్చుకోడు, మనలను దగ్గరకు తీసుకోడు.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు