*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౧౫ - 015)
 కందం:
*పందిరి మందిరమగునా?*  
*వందిజనంబా ప్తమిత్ర వర్గంబగునా?*
*తుందిలుఁడు సుఖముఁగనునా?*
*గొంది నృపతిమార్గమగున?గువ్వలచెన్నా!*
తా.: 
  నలుగురికీ చల్లదనాన్నిచ్చి శ్రమను తగ్గించే చలువ పందిళ్ళు, దేవుడి గుడి అవలేవు కదా!  ముందు పొగుడుతూ వెనుక తిట్టే వారు మనకు మనసుకు నచ్చిన స్నేహితులు అవలేరు.  పెద్ద బానపొట్ట వున్నవాడు ఆనందాన్ని పొందలేడు.  చిన్నపాటి సందు మహారాజు గారు తిరిగే రాజమార్గము అవదు ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*ఈ చలువ పందిళ్ళు, సన్నని దారులూ, గుంపులో గోవిందా అంటూ తమ ప్రత్యకత ఏమాత్రమూ  చూపలేని వాళ్ళూ, ఇటువంటి వారి వల్ల మన సమయం వృధా అవడం తప్ప, మన ఆధ్యాత్మిక పురోగతికి ఏవింధం గానూ వుపయోగపడరు.  ఈ మాయా ప్రపంచం నుండి వెలుపలికి వచ్చి, పరమాత్ముని వైపు అడుగులు వేసే అవకాశాన్ని మాకు నీవే కలిపించాలి, అనంతశయనా!  నిన్ను మర్చిపోకుండా మమ్మల్ని నీవే కాపాడాలి, కాపాలికా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు