*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౧౭ - 017)
 కందం:
*అంగీలు పచ్చడంబులు*  *సంగతిఁగొనుశాలుజోడు సరిగంచులమేల్*
*రంగగు దుప్పటు లన్నియు*
*గింగళి సరిపోల వన్న!గువ్వలచెన్నా!*
తా.: 
  చొక్కాలు, పట్టు బట్టలు, రెండు అంచుల పైబట్టలు, పంచలు, రంగు రంగుల దుప్పట్లు ఎన్నో వున్నా, అవి అన్నీ ఒక గొంగళి కి సాటురావు  ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*మనం ఈ ప్రపంచంలో దొరికే అతి ఖరీదైన దుస్తులు, నగలు ఎన్నో సంపాదించు కోవచ్చు.  కానీ మనశ్శాంతి ని ఎలా సంపాదించుకోవాలో తెలియకపోతే సుఖమనేది దొరకదు కదా, పండరినాధా!  మన ఐహిక సంపద అంతా,  మనకు  ఆందోళనను, అంధకారమైన మార్గాన్ని మనకు అందిస్తుంది.  కానీ, శాస్వతమైన పరమాత్మతో సౌఖ్యానికి ఏమాత్రమూ దగ్గరగా తీసుకెళ్ళదు.  మనల్ని ఆ సర్వేశ్వరునికి దగ్గరగా తీసుకెళ్ళ గలిగే ఆ తారకనామానికి వీలైనంత దగ్గరగా వుండే ప్రయత్నం మనమందరం చేయాలి, నిత్యము.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు