కందం:
*కలిమిఁగల నాఁడె మనుజుఁడు* *విలసనమగు కీర్తిచేత వెలయఁగ వలెరా!*
*గలిమేమి ఎల్లకాలము* *కులగిరులా కదలకుండ?గువ్వలచెన్నా!*
తా.:
ఈ భూమి మీద మనుషులకు వారి వద్ద వున్న డబ్బును బట్టీ కీర్తి వస్తోంది. కానీ డబ్బు, కుల పర్వతము లాగా శస్వతముగా ఏవ్వరి దగ్గరా వుండదు. ఏ మనిషికైనా, ఆతను చేసే పనుల వలన వచ్చిన కీర్తి శాస్వతము గా వుంటుంది ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*సత్యభామా దేవి వద్ద ప్రతి దినమూ ఇరువది ఎనిమిది బారువుల స్వర్ణాన్ని ఒసగే శమంతకమణి వున్నది అని మనం విన్నాము. ఈ స్వర్ణాన్ని ఆధారం చేసుకుని కృష్ణుని దానంగా ఇచ్చేసింది, భామామణి. కానీ, పరంధాముణ్ణి సేవా బద్దత నుండి ముక్తుణ్ణి చేసింది, ఒక్క తులసీ దళము కదా. ఐహిక అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైన ధన సముపార్జన విధాయకము, అనుసరణీయము. కానీ, భగవత్కృప వల్ల మన అవసరాలకు మించిన సంపద, మనకు సమకూరితే, నలుగురికీ అవసరమైన పనులు చేయడం వలన ఇహము, పరము కూడా కలుగుతాయి. నలుగురికీ మంచి జరగాలి అని కోరుకుని, ఆ దిశగా పనిచేసినప్పుడు మనల్ని సమాజం గుర్తించిన, గుర్తించక పోయినా, పరమేశ్వర అనుగ్రహం తప్పకుండా వుంటుంది. ఇది కదా కావలసినది. ఎంతో మంది అజ్ఞాత దాతలు వున్న పుణ్య భూమి మనది. మనం కూడా అందులో భాగం అయ్యే సత్ ప్రయత్నం చేద్దాము*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి