కందం:
*బుడ్డకు వెండ్రకలున్నన్*
*గడ్డముకానట్ల కార్యకరణుల సభలన్*
*దొడ్డుగఁ జూతురె? తలపై* *గుడ్డలు బుట్టంత లున్న? గువ్వలచెన్నా!*
తా.:
మనుషులకు ఎద్దవైన వృషణాలమీద జుట్టు వున్నంత మాత్రాన గడ్డము మొలిచినట్లు కాదు కదా! ఎలాగంటే, కష్ట పడి శ్రమించి పనులు చేసేవారు తలపైన బుట్టలంత తలపాగా చుట్టకుంటే పెద్దవారు అవ్వలేరు కదా, అలాగ. ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*మన ఆహార్యం కంటే మనం చేసే పనులు, నలుగురికీ పనికి వచ్చేవి, మాట్లాడాలి. మన ప్రవర్తన మన గురిచి చెప్పాలి. మనం చెసే స్నేహాలు, మన స్నేహితులు మన గురించి చెప్పగలగాలి. అంతే కానీ, అనవసర ఆర్భాటాలు మాట్లాడవు, మాట్లాడ లేవు. కర్ణుని తో స్నేహం చేయడం వలన దుర్యోధనుని గొప్పతనం పెరగక పోగా ఇబ్బంది పడ్డాడు. ఇక్కడ దృతరాష్ట్రుని కుమారుని వద్ద ఎన్నో సంపదలు వున్నా వారు చేసిన పనుల వల్ల చిన్నతనం అనుభవించారు గానీ గొప్పగా జీవించ లేక పోయారు కదా.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి