కందం:
*కలుద్రావి నంజుడుం దిను*
*ఖలుసుతుఁడు వకీలె యైన ఘనమర్యాదల్*
*తెలియవు బ్రాహ్మణుడైనను*
*కులపాంసనుఁ డనఁగఁదగును గువ్వలచెన్నా!*
తా.:
మందు తాగి, మాంసము తిని, చెడు పనులు చేస్తూ బ్రతికే వాడు సమాజంలో ఎంతో గొప్ప గా చూడబడే న్యాయవాద వృత్తి లో వున్నవారైనా ఎటువంటి గౌరవము పొందలేరు. అలాగే, బ్రాహ్మణ ఇంటిలో పుట్టి, కల్లు, మాంసము, చెడు తిరుగుళ్ళు తిరిగుతూ వుంటే ఆ బ్రాహ్మణ వ్యక్తికి కూడా ఎటువంటి గౌరవ మర్యాదలు దక్కవు ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*మానవ కులంలో పుట్టి, మానవతా దృక్పధంతో జీవిన విధానాన్ని గడపవలసిన మనిషి, తన బాధ్యత మరచి ప్రాపంచిక, ఐహిక సుఖాల వెంట పరుగలెత్తుతూ వుంటే అటువంటి మనిషికి ఎవరు మాత్రం గౌరవం ఇస్తారు. మనిషి తన తోటి వారిపై మమతానురాగలతో, సానుకూల దృక్పథంతో వుండాలి కదా! ఒకరికి ఒకరు పరస్పర సహకారం చేసుకుంటూ చక్కని సమాజ నిర్మాణంలో తనవంతు భాగం పంచుతూ, పరిపూర్ణమైన, ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి. ఆవిధంగా, పరమాత్మ కటాక్షం మనమందరం మీద సంపూర్ణంగా వుండాలి అని ఆ పరాత్పరుని వేడుకుందాము.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి