86.
త్యాగాలకు మరో పేరు,
కష్టానికి తగ్గ పేరు,
శాంతిగా నడిచేవారు,
తరలొచ్చిన గాంధి గారు.
87.
సుప్రభాతము వినుము.
మంచినే పాటించుము.
స్ఫూర్తిగా జీవించుము.
ఆనందంగా గడుపుము.
88.
శత్రుత్వము వీడుము.
ప్రేమలను పంచుము.
మిత్రుడిలాగా చూడుము.
బతుకు ఆనందమయము.
89.
ఎదురుదెబ్బ తగలటం,
ఎదుటివారు చెప్పటం,
సహజంగానె ఉండటం,
ఇదే మన జీవితం.
90.
గుండె బలం కలిగినోడు.
మనసు భారం మోస్తాడు.
కండ బలం కలిగినోడు.
సహజ బరువు మోస్తాడు.
91.
దేవుళ్ళందరు ఒకటే.
మనుషులందరూ ఒకటే.
మారువేషం ఒకటే.
మారు రూపం ఒకటే.
92.
సత్యాన్ని ఇష్టపడుము!
హింసను వదిలి పెట్టుము!
శాంతియుతంగా సాగుము!
జీవితంలో బాగుపడుము.
93.
ప్రాప్తిరస్తు అనుము,
సుఖీభవని దీవించుము.
విద్య ప్రాప్తిరస్తు అనుము,
సకల సుఖాలు పొందుము.
94.
గెలుపును స్వాగతించు!
ఓటమి అంగీకరించు!
సహజమని భావించు,
అడుగు వేసి సాగుచు!
95.
శుక్రాచార్యుడు చెప్పిన!
బలిచక్రవర్తి ఆగున!
మాటకు కట్టుబడిన!
నెరవేర్చాలని తపన!
96.
ఆరోపణలు చెప్పకు.
ఆగ్రహానికి గురి కాకు.
పిసినారితనం చూపకు.
తప్పుగా మాట్లాడకు.
97.
జీవితం తెలుసుకో!
బాధ్యతలు పెంచుకో!
బాధలు అధిగమించుకో!
జీవించడం నేర్చుకో!
98.
దురాశకు గురికాకు.
ఆకాంక్షలు పెంచుకోకు.
పనికిరాకుండా పోకు.
చెడువైపెప్పుడు సాగకు
99.
అలుసుగా మాట్లాడకు.
అతిగా ప్రవర్తించకు.
తప్పులు చేసి చూపకు.
అక్రమంగా బతకకు.
100.
ఆకాంక్షను తీర్చుకోండి.
దాని వైపే నడవండి.
కష్టపడి మెలగండి.
ఫలితాన్ని సాధించండి.
101.
పల్లెలో నివసించుము.
ప్రకృతిని చూడుము.
స్పందన కలిగిండుము.
ఆనందాన్ని పొందుము.
102.
యుద్ధం కోసం రాముడు.
కష్టపడ్డ లక్ష్మణుడు.
శాపంతో రావణుడు.
గెలిచెనే రామలక్ష్మణుడు.
103.
చదువు విలువ తెలుసుకో!
దయాగుణం పెంచుకో!
జ్ఞాన గుణం పంచుకో!
శాంతిగా నడుచుకో!
104.
చదువు యొక్క విలువను!
అలుసుగా చూస్తేను,
అందరిలోనూ ఇదేను!
లోకజ్ఞానం ఏమగును!
105.
అమ్మలోని ప్రేమ తనము.
నాన్న లోని ధైర్యము.
ఎవ్వరు మరవని విషయము.
అదే వాళ్ళ ప్రేమమయము.
106.
దానగుణం పెంచుకో!
మంచితనం ఉంచుకో!
చెడుతనం వదులుకో!
ధ్యానాన్ని చేసుకో!
107.
రాతలు మార్చుకొనుమూ!
చదువు ఇష్టపడుమూ!
ఉండాలి సాహసమూ!
చెడును ఎదిరించటమూ!
108.
దేశమంతా తిరిగినా.
కష్టపడి పని చేసినా.
కూనిరాగం కూసినా.
ఫలితాలు వచ్చునా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి