"సమయస్ఫూర్తి";-నేనావత్ మౌనిక10వ తరగతిZPHS నేరెళ్ల పల్లిమండలం: బాలానగర్జిల్లా: మహబూబ్ నగర్7013264464
 ఒక అడవికి రాజు సింహం. చాలా పొగరుగా ఉండేది. నేనే రాజునీ,  నా కంటే ఎవరు ఎక్కువ కాదు. అడవికి ఒక్కగానొక్క రాజుని అని గర్వంగా చెప్పుకునీ అహంకారంగా ఉండేది.
ఆ అడవిలో సింహం తో పాటు, నక్కలు,జింకలు, జింక పిల్లలు ఇతర జంతువులు ఉండేవి. ఒకరోజు జింక తన పిల్లలతో పాటు ఆహారం వెతకటానికి అడవిలోకి వెళ్ళింది. అలా అలా  వెళ్తూ వెళ్తూ కొంత ఆహారాన్ని తీసుకొని వస్తుంటే, నక్క ఎదురైంది. 
నక్క జింక ఇలా మాట్లాడుకుంటారు. "నక్క ఒక జింక పిల్లను ఇచ్చేయమని జింకను భయపెడుతుంది. ఈ అడవి రాజు కి నాకు దగ్గరి సంబంధం ఉంది. నేను ఏం చెప్పిన రాజైన సింహం నా మాట వింటుంది. అని అంటుంది నక్క."జింక ఏమనకుండా తెలివిగా ఆలోచించింది. జింక వస్తుంటే సింహం ఇతర నక్కలతో ఎదో సమావేశంలో ఉండి మాట్లాడుతుంది. ఆ విషయం గుర్తుకు వచ్చి నక్క ను పక్క దారి పట్టించాలని అనుకుంది.  "అవును కదా! అని లోపల భయపడ్తున్న బయటకు ఏమి లేకుండా ఉంది." రాజైన సింహం మిగతా నక్కల తో, ఈ అడవికి రాజు ని మీలో ఎవరినైనా, ధైర్య సాహసాలు కలిగిన వారిని నియమిస్తానని మాట్లాడుతుండే".."మీ మేలు కోరి చెప్తున్నాను ఇది నిజం" "అవునా! నాకు చెప్పకుండా వాళ్లతోనే ఎలా మాట్లాడుతుంది"
"ఏమో నిన్ను కూడా ఆ నక్కల లోనే ఉన్నావనీ అనుకుందేమో! "అవును నేను వెళ్ళాలి! నాకు ఈ జింక పిల్ల కంటే అడవికి రాజు అవ్వడం ముఖ్యం.  అని నక్క వెళ్ళిపోతుంది.
జింక పిల్లలు కూడా ఒక దగ్గర నిలబడి, జింక, నక్క మాట్లాడింది వింటారు. జింక తన పిల్లల దగ్గరికి ఆహారం తీసుకొని వస్తుంది. పిల్లలు జింక తో ఇలా అంటారు.
"అమ్మ భలే నక్కని పక్కదారి పట్టించావు"నేను ఏదో చెప్తే నక్క నమ్మేయాలా కొంచెమైనా ఆలోచించాలి కదా!
"అవునమ్మా! సింహం చాలా అహంకారంతో ఉంటుంది. తను ఉండగా నక్కనెలా రాజును చేస్తుంది. అవునూ! అవునూ! అని, జింక నవ్వుతూ! తన పిల్లలకి ఆనందంగా ఆహారం పెడుతుంది. తన పిల్లలతో మంచి విషయాలు, మాటలు చెప్పి, ఎలా నడుచుకోవాలో, కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలో, నలుగురితో ఎలా ఉండాలో చెప్పి పెంచుతోంది. పిల్లలు తల్లి చెప్పినవి వింటూ ఆనందంగా జీవితం  గడుపుతారు....
నీతి:
అపాయంలో ఉన్నప్పుడు, ఆ అపాయం నుంచి ధైర్యంగా, తెలివిగా తప్పించుకునే ఉపాయం కోసం ఆలోచించాలి..

కామెంట్‌లు