ముత్యాల హారాలు-- విస్లావత్ సావిత్రి.10వ తరగతి.ZPHS నేరళ్లపల్లిమహబూబ్ నగర్ జిల్లా7013264464

 1.
ధనం కలిగి ఉందాం.
పేదలకే పంచుదాం.
మంచి పనులు చేయుదాం.
సంతృప్తి పొందుదాం.
2.
కష్టాలకు గురియైనా.
పేదరికం వచ్చినా.
మరణమే వచ్చినా.
విజయమే ఆగునా.
3.
కష్టపడి పని చేయుము.
ఉన్నత స్థాయికి ఎదుగుము.
మంచి పేరు సాధించుము.
సుఖంగా జీవించుము.
4.
అందమైన పుస్తకాలు.
బడి గుడిలోన బోధనలు.
ఉపాధ్యాయుల ఆశలు.
తల్లిదండ్రుల నమ్మకాలు.
5.
అహర్ణిశలు శ్రమిస్తేనే.
నాలుగు రాళ్లు వచ్చునే.
చెమటను చిందిస్తేనే.
ప్రజలకు బువ్వ దొరికెనే.
6.
పొద్దున మేల్కోవాలి.
వ్యాయామం చేయాలి.
పోషకన్నం తినాలి.
ఉల్లాసంగా ఉండాలి.
7.
ఆనందాల నిలయం.
అనురాగాల బంధము.
ఐక్యంగా ఉందాము.
మనకు లేదు కదా భయము.
8.
ఇచ్చిన మాట తప్పకు.
అతిథిని తిరస్కరించకు.
రాక్షసిలా ప్రవర్తించకు.
చెడ్డ పేరును తెచ్చుకోకు.
9.
ఇచ్చిన మాట నిలుపుకో.
అతిథిని గౌరవించుకో.
వినయం అలవర్చుకో.
గౌరవాన్ని తెచ్చుకో.
10.
పెద్దలను గౌరవించు.
అమ్మ నాన్నను ప్రేమించు.
ప్రజలను ఆదరించు.
మంచి పేరు సాధించు.
11.
పచ్చని చెట్ల మా పల్లె.
పంట పొలాల మా పల్లె.
స్వచ్ఛంగా ఉండే  పల్లె. 
ఉందాం కుటుంబమల్లె.
12.
పాడిపంటల మా పల్లె.
పశుసంపద మా పల్లె.
పిల్ల పెద్దల మా పల్లె. 
కళకళలాడెను పల్లె
13.
అనురాగాల మా పల్లె.
చదువుల్లోను మా పల్లె.
మంచి జ్ఞానo విలసిల్లె
హాయిని గొలిపే పల్లె.

కామెంట్‌లు