"ముత్యాల హారాలు":-నేనావత్ మౌనిక10వ తరగతిZPHS నేరెళ్ల పల్లి7013264464
 1.
రామాయణం చదువుకొ!
మంచి అలవాట్లు నేర్చుకొ!
ప్రేమలనూ తెలుసుకొ!
బంధాలను పెంచుకొ!
2.
కష్టం వచ్చిననూ
నష్టం వచ్చిననూ
ప్రాణం పోయిననూ
ఆడిన మాట తప్పనూ
3.
 ఓ అనుభూతి అమ్మ
 ఓ  ఆప్యాయత అమ్మ
 ఓ  ఆత్మీయత అమ్మ
  ఓ అనురాగం అమ్మ
4.
కమ్మని పలుకు అమ్మ
అంతులేని ప్రేమ అమ్మ
చక్కని ఓదార్పు అమ్మ
అమృత కావ్యం అమ్మ
5.
నిర్లక్ష్యం తొలగించుము
గురువును గౌరవించుము
ఆప్యాయతలను పంచుము
అమ్మను ఆరాధించుము
6.
అమ్మ ఒడిలో ప్రేమలను
పాఠశాలలో పాఠాలను
చరిత్రలోన కీర్తులను
గమనమై సాగవలెను.
7. 
మానవత ప్రదర్శించు
మనిషిగా ప్రవర్తించు
ఇతరులకు మేలు చేయుచు
అందరిని గౌరవించు
8.
ఎంతగానో కోపము,
నిరాశలకు రూపము.
మంచికి నిదర్శనము
శాంతమే ప్రధానము
9.
పుస్తకాలు చదువుము
మంచి పేరు సాధించుము
చదువే బాటని తెలుపుము
భవిష్యత్తు ఆనందము
10.
గురువును ఆరాధించు
మంచి మార్గం చూపించు
చెడు దారి మార్పించు
సత్యాన్ని గెలిపించు
11.
అసత్యాలను తెలుపకుము
సత్యాలను తెలుపుము
అన్యాయo ఎదిరించుము
న్యాయాన్ని కాపాడుము
12.
జ్ఞానాన్ని పెంచే వాళ్లు
అమ్మను పూజించువాళ్ళు
ప్రేమను పంచే వాళ్ళు
వీళ్ళే అసలు ఉత్తములు
13.
అలలాంటి కెరటము
అందమైన జీవితము
కష్టసుఖాల గమ్యము
రానే వచ్చు ఫలితము

కామెంట్‌లు