- కట్ట కడపటి శతక పద్యం
శార్దూలము:
*దంతంబుల్పడనప్పుడే తనువునం | దారూఢి యున్నప్పుడే*
*కాంతాసంఘము రోయనప్పుడే జరా | క్రాంతంబుగా నప్పుడే*
*వింతల్మేన చరింపనప్పుడె కురు | ల్వెల్లంగగానప్పుడే*
*చింతింపన్వలె నీ పదాంబుజములన్ | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
పళ్ళు ఊడి పడి పోక ముందే, శరీరంలో మార్పులు వచ్చి, ముడుతలు పడిపోయి, స్త్రీలు అసహ్యించు కోక ముందే, ముసలితనం తో కళ్ళు కనబడక, చెవులు విన పడకుండా అవక ముందే, తల మీద జుత్తు నెరిసి పోయి ముగ్గు బుట్టలా మారక ముందే, నేను నీ పాదాలు పట్టుకుని వుండేలా నువ్వే చేయి, స్వామీ! ....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*మహానుభావా! బోళాశంకరా! జీవించి నంత కాలం జీవించం ఎవరమూ కూడా. ఇప్పటి వరకూ నీవు మాకు రుచి చూపిన జీవితం ఇంక చాలు, ఉమాపతీ! జుత్తు నెరవక ముందే, కళ్ళు కాంతివిహీనం కాకముందే, కరచరణాదులు చచ్చుబడక ముందే, శరీరంలో వింత వింత మార్పులు రాకముందే, నీ నామం స్మరించే దిశగా నన్ను నీ వైపుకు నీవే నడిపించాలి, సదాశివా! ఎప్పుడో వయసుమళ్ళాక నీవైపు చూడటం కాదు, ఇప్పుడు ఒంట్లో సత్తువ వుండగానే నీ ముందు నేను వుండాలి. నీ ముందే వుండాలి. వేరే ఏదీ నాకు ముఖ్యం కాదు. నీ సన్నిధానమే నాకు కైవల్యధామం. బోళాశంకరుడివి కదా, నా మీద నీ కరుణా దృక్కులు సారించి, సార్ధక నామధేయుడివి అవు స్వామి, విరూపాక్ష*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి