15వ ఏట అత్తారింటికి వెళ్లాను; .అన్నంగి వేంకట శేష లక్ష్మి ;-..సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
 శ్రీమతి అన్నంగి వేంకట శేష లక్ష్మి గారు.82ఏళ్ల వయసు లో గూడా ఆధ్యాత్మిక రచనలు చేస్తూ యోగా మెడిటేషన్ పుస్తక పఠనం లో కాలం గడుపుతున్నారు.ముగ్గురు కొడుకుల ఉమ్మడి కుటుంబం.తామరాకుపై నీటిబొట్టు లా ఉండే ఆమె నిగర్వి.మనసు విప్పి నిష్కళంకంగా సుతిమెత్తగా నొప్పించకుండా మాట్లాడుతారు.20పైగా రచనలు చేసి శృంగేరీ పీఠాధిపతి ఆశీస్సులు పొందారు.సేవా కార్యక్రమంలు మహిళా మండలి రేడియో ప్రోగ్రాంలు  చేశారు.చాలా సన్మానాలు పొందారు.ఈవయసులోగూడా పేపర్ పై అందమైన దస్తూరీలో రాసి నాకు పంపారు.‌.
------------------------------------------------------------------------------------.
 ఆమె బాల్యస్మృతులు తన మాటలలో తెలుసుకుందాం. "నాకు మా నాయనమ్మ పేరు పెట్టారు.మహా మడి  ఆచారం చాదస్తం కూడా ఎక్కువ.ఆనాడు అన్నీ పెంకుటిళ్ళు.వెనక ఉండే ఇల్లు వంటకి‌ రోజు ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టాలి.పెరటిలో తులసి కరివేపాకు పూల మొక్కలు బావి పైకప్పు లేని స్నానాల గది.వీధి వైపు ఇల్లు పడకగదులు వరండా కొబ్బరి చెట్లు ఉండేవి.బామ్మ పిడకలపై పాలు కాచేది. పెద్ద కుండలో పెద్ద కవ్వంతో  మజ్జిగ చిలికేది.మా ఊరు నేదునూరు గోదావరి జిల్లాలోది.ఒకరోజు నేను కాకులు సబ్బు ఎత్తుకు వెళ్తాయని  తెచ్చి వసారాలో బియ్యం బస్తాపై పెట్టాను.అంతే! బామ్మ నానా హంగామా చేసింది."హయ్యో! బియ్యం బస్తాలు అంటుమంగలం చేశావు"అని  బస్తాలపై గంగాజలం  చిలకరించింది.మా అమ్మ కు అంత చాదస్తం లేదు.కానీ రెండు మడిచీరలుండేవి.మేము నలుగురు అక్క చెల్లెళ్ళు నలుగురు అన్నదమ్ములు కావటం నేను పెద్ద దాన్ని కావటంతో బాధ్యతలు కూడా ఎక్కువగా ఉండే వి.5వ క్లాస్ దాకా చదివాను.
 మానాన్న మహాపొదుపు.ఆడంబరాలకి చాలా దూరం.తిండిబట్టకి లోటు లేదు.దానధర్మాలు చేసేవారు.మరీ బీదబిక్కికి లేదు అనవద్దు.తోచినంత ఇచ్చిపంపమనేవారు.పిల్లలందరికీ ఒకే తాను తెప్పించి యూనిఫాం లాగా కుట్టించేవారు.బ్యాండ్ మేళం లాఉండేవారం.ఒకసారి ఆడపిల్లలకోసం పూల తాను బట్ట తెప్పించారు.మా ఆడపిల్ల లకి కొలతలు తీసుకుని రవికి ఈబట్ట సరిపోతుంది అన్నాడు దర్జీ. సరే అన్నారు నాన్న. మాపనికుర్రాడిపేరు రవి."అయ్యో! మగపిల్లాడు రవికి పూల ఆడచొక్కా ఏంటి?"అమ్మ ఖంగారుగా అరిచింది."నీకు రవికె (జాకెట్)కుడతాడు టైలర్ "నాన్న అనటంతో నవ్వులు పూశాయి.నాన్నగారు బి.డి.ఓ.తాసిల్దారుగా పనిచేసిన గర్వం అహంకారం లేవు.ఒకసారి అమ్మ నాన్న తిరుపతి వెళ్లితే వితంతువైన మామేనత్త మడితడి పాటిస్తూ వండివార్చేది.పిల్ల మూకీ కబుర్లు కేరింతలతో కలిసి రోజు అన్నం తినేవారం."గంటపైగా సాగింది మాతిండి."అబ్బా!రావణపిల్లలురా మీరు!"అని విసుక్కుంది.మడిలో అంతా తినేదాకా అలా నిల్చునే ఉండేది.మా గడుగ్గాయి చెల్లి వెంటనే అడిగింది"రావణుని చెల్లి పేరు ఏంటి అత్తమ్మా?" పాపం కాసేపు కోపం తో గొణిగి ఊరుకుంది. నాన్న గ్లాస్ లో షర్బత్ బిళ్ళ వేసి నీరు పోసి
 మూతపై చేయిపెట్టి మాజిక్ అని తీయని పుల్లటి షర్బత్  ఇస్తే గటగట తాగేవారు.నాకు11వ ఏటనే పెళ్లయింది.15వ ఏట అత్తారింటికి వెళ్లాను.మా చెల్లి కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.ఆరోజు పెళ్లి వారు వస్తారని ఒకటే హడావుడి! నాకు ఓ చిలిపి ఊహ ! వెంటనే అన్నయ్య ప్యాంటు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని నెత్తిన హ్యాట్ పెట్టాను.ఈలోపల బడి నుంచి వచ్చిన తమ్ముళ్ల ను హెచ్చరించాను.దర్జాగా ముందు హాల్ లో కూర్చున్నాను.పెళ్ళి కొడుకు ఒంటరిగా వచ్చాడని  ఇంటి లో హడావిడి మొదలైంది.అందరికళ్ళు కప్పి పెళ్లి కూతురు నా దగ్గరకు వచ్చింది.అసలే చిలిపి గడుగ్గాయి.! నన్నే ప్రశ్నలు 

కామెంట్‌లు