@ఒకరిని ద్వేషించి, హింసించి అనుభవించే ఆనందం రాక్షసానందం.
@కష్టాలు పెద్దవి అయేకొలది వాటిని అధిగమించినందుకు కలిగే ఆనందం అధికం అవుతుంది. నావికులు తుఫానులు, మహా తుఫానుల ద్వారానే అనుభవాలను పొందుతారు.
@కష్టించి పనిచేసినప్పుడే విశ్రాంతిలో ఆనందం తెలుస్తుంది.
@కేవలం డబ్బు సంపాదించటంలోనే ఆనందం లేదు, సాధించిన దానిని అనుభవించటంలో, సృజనాత్మక కృషి అనే తృప్తి ఉంటుంది.
@కోరికలు తీర్చుకోవడంకంటే వాటిని చేయించడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. బుద్ధుడు
@గ్రామీణ వాతావరణంలో చేతనైనంతవరకు సాటివారికి సహాయపడుతూ, ప్రేమిస్తూ, విశ్రాంతి, ప్రకృతి,పుస్తకాలు, సంగీతంతో గడపటమే ఆనందం. టాల్ స్టాయ్
@చక్కని హాస్యం ఆత్మకు ఆనందం కలిగిస్తుంది. విషాదం బాధను కలిగిస్తుంది.
@చేస్తున్న పనిలో ఆనందం పాటించినప్పుడే అది అద్భుతఫలితాలనిస్తుంది. స్టీవ్ జాబ్స్జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం @ఓ మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణ
@డబ్బు చాలా విలువైన వస్తువులను కొనగలుగుతుంది, కాని ప్రేమ,శాంతి, ఆనందం చాలా విలువైన నిధులు.
@డబ్బు, అధికారం, దేంట్లో దొరకని ఆనందం ఇతరులకు సేవ చేయడంలో ఉంది
@తాగుబోతుకు మద్యం ఆనందం యివ్వవచ్చు కాని కుటుంబానికి విషాదం మిగుల్చుతుంది.
@తాగుబోతుతనం వ్యక్తికి ఆనందం, భార్యాబిడ్డలకు విషాదం.
@దృఢమైన జాతిలక్షణాలు.1.విజయాల పట్ల సామూహిక ఆనందం,2. ఐకమత్యం, 3. పని సామూహిక ఆచరణ.
@ధనం పుచ్చుకొనేటప్పుడు ఉన్న ఆనందం యిచ్చేటప్పుడు కూడా వుండాలి.
@నిజమైన ఆనందం, సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్ళు. పంచతంత్ర
@పరులకు ఆనందం కలిగిస్తూ తన పనులు చేసుకోవడమే చాతుర్యం.
@ పవిత్ర ఆలోచనలతో మాట్లాడిన, పనిచేసిన వ్యక్తిని విడువని నీడలాగా ఆనందం వెంట వుంటుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి