01.
తే.గీ.
పప్పుదినుసులుభుజియించముప్పుదొలగి
దేహమంతయుపుష్టిగాతేలియాడి
సకలఆరోగ్యభాగ్యమ్ముసాధ్యమౌను
అందుకనిఆరగించుముముందుగాను!!!
02.
తే.గీ.
కూరగాయలనెప్పుడుకోరితినుము
పోషకవిలువలెన్నెన్నొభూరిగాను
లభ్యమైరక్తశుద్ధినిరక్షజేయు
అందుకనిఆరగించుముముందుగాను!!!
03.
తే.గీ.
పళ్ళరసములుసేవించుప్రతిదినంబు
చెరుకు,నిమ్మరసములనుమరువకుండ
విరివిగావాడిననుగానిధరణిపైన
అమితమారోగ్యమేదక్కిహాయిగూర్చు!!!
04.
తే.గీ.
ఆకుకూరలశాఖమ్ముననవరతము
ప్రీతితోతినవలెనునేవేళనైన
పచ్చిమొలకలుఉదయానమెచ్చితినిన
వ్యాధిబాధలునయమయ్యిఫలితమబ్బు!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి