*ముత్యాలహారాలు*:-పావని 9వ తరగతి-ZPHS నేరళ్లపల్లి,బాలానగర్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా,7013264464
1.
అన్ని చెట్లను పెంచుదాం.!
ప్రకృతిని కాపాడుదాం.!
మంచి గాలి పీల్చుదాం.!
ఆయువునే పొందుదాం.!
 2.
పొద్దు పొద్దున  లేవండి.!
మంచి  నీళ్లు తాగండి.!
ఉల్లాసంగ ఉండండి.!
ఆరోగ్యాన్ని పొందండి!.
3.
ఉదయాన్నే లేవాలోయ్.!
వ్యాయామం  చేయాలోయ్!.
పండ్లు బాగా తినాలోయ్.!
ఆనoదంగ ఉండాలోయ్.!
4.
మంచి  మంచి పిల్లలు.!
మా ఇంటీ  నవ్వులు.!
అందమైన  పువ్వులు.!
ఆనందానిచ్చే  సొగసులు.!
5.
అమ్మను నీవు  ప్రేమించు!
నాన్నను గౌరవించు!
అందరిని  ఆధరించు!
సంతోషంగ జీవించు!
6.
బడి  అంటే మనదిరా! 
బడికి  పోదామురా!
మంచిగ చదువుదామురా!
లక్ష్యాన్ని చేరాలిరా!
కామెంట్‌లు