"ముత్యాల హారాలు";-సభావట్ చంటి 9 వ తరగతిZPHS నేరళ్ళపల్లిబాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా7013264464
 40.
అమ్మ ఒడి మన ఇల్లండి.
రక్షణను ఇస్తుందండి.
సందడిగ ఉంటుందండి.
మనక నివాసం కదండి
41.
లక్ష్మీదేవి ఆవు రా!
గోమాతను పెంచారా!
స్వచ్ఛ ని పాలు తాగరా!
హాయిగా ఉండరా!
42.
చెత్త బయట వేయకండి.
స్వచ్ఛత ను పాటించండి..                
పరిశుభ్రంగ ఉండండి.
రోగాన్ని తగ్గించండి.
43.
అవనికే అందం నది.
మంచి నీటిని ఇస్తుంది.
పాపాన్ని తొలగిస్తుంది.
పుణ్యాన్ని అందిస్తుంది.
44.
సాయం కలిగుండండి.
సహాయాన్ని చేయండి.
పుణ్యాన్ని పొందండి.
ప్రేమతో నడవండి.
45.
పట్టణం వద్దురా!
పల్లెటూరే ముద్దురా!
ప్రకృతిలో ఉండరా!
సంతోషంగ ఉండరా!
46.
ఉన్న ధనం చాలండి.
అత్యాశ వద్దండి.
ఆపదలో పడకండి.
దానితోనే సాగండి.
47.
ఆవేశం వద్దండి.
అదే మనకు ముద్దండి.
ఆలోచించి నడవండి.
హాయిగాను సాగండి.
48.
టీవి చూచుట మానండి.
చరవాణిల వాడకండి.
సిగ్నల్స్ తగ్గించండి.
పక్షులను రక్షించండి.
49.
చదువు ఇస్తుంది వెలుగు.
జ్ఞానంతోనే మెలుగు.
లక్ష్యం బాటను ఎరుగు.
మంచి పేరు నీదగు.
50.
ఓటమితొ పోరాడండి.
గెలుపును అనుసరించండి.
గెలుపు రుచి చూడండి.
అదే మీకు సొంతమండి.

కామెంట్‌లు