ముత్యాలహారాలు;-బి. పావని 9వ తరగతిZphs నేరళ్లపల్లిబాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా7013264464
 111.
ఆడపిల్లంటె అందం.
నవ్వితే  ఆనందం.
ఏడిస్తే దరిద్రం.
తనంటనే  మధురం.
112.
మా అక్కకు పెళ్ళంట.
పచ్చనైన  పందిరంట.
పందిట్లో  గాజులంట.
అందరు తొడిగిరంట.
113.
మా పల్లె  నాకిష్టం.
పండుగలు  నాకిష్టం.
ఆటలంటె నాకిష్టం.
పాటలంటె  నాకిష్టం.
114.
రామ్మా  చిలుకమ్మా.
రంగుల  మొలకమ్మా.
ఎర్రని ముక్కమ్మా.
తియ్యని  పాటమ్మా.



కామెంట్‌లు