"ముత్యాల హారాలు";-పాత్లావత్ పురందాస్ 9 వ తరగతి-ZPHS నేరళ్ళపల్లి-బాలానగర్ మండలం-మహబూబ్ నగర్ జిల్లా
 51.
బడి విలువ తెలుసుకో
చదవడాన్ని నేర్చుకో
స్నేహితులను చేర్చుకో
జ్ఞానాన్ని పెంచుకో
52.
చిన్న గుంటూవు నీవు
కొండంత వెలుగిస్తావు
మాకై పోరాడుతావు
ధైర్యాన్ని నువ్వు ఇస్తావు
53.
చరవాణి చూడకురా
పుస్తకాలు చదువురా
నీతిని తెలుసుకోరా
మంచిని ఆశించురా
54.
చెడును నీవు చూడకు
చెడును నీవు మాట్లాడకు
చెడును నీవూ వినకు
గాంధీ చెప్పాడు మీకు
55.
చుట్టాలను గౌరవించుము
నిరాశను పరచకుము
ఆనందంగా పంపుము
హాయిగా నీ వుండుము
56.
ఉన్న వారితో ఉండుము
లేని వాళ్ళను మరువము
సంతోషంగా సాగుము
ఆనందం నీ సొంతము
57.
స్త్రీలను గౌరవించరా
వారితొ కలిసుండరా
స్నేహాన్ని చూపురా
ఆనందాన్ని పంచరా
58.
కుల, మత బేధములు
నీ ప్రాణానికి ముప్పులు
ఆపుము మీ సోకులు
చెప్తారు మనకు సాకులు
59.
తినే తిండి పై ధ్యాస
ఆనందాన్ని చూస
మార్పు వచ్చే నా యాస
పరులకు ప్రాణం పోస
60.
గోమాతను ప్రేమించుము
గోవులను నీవు పెంచుము
పాపాలను చేయకుము
పుణ్యాన్ని నీవు పొందుము
61.
కాలుష్యాన్ని మానురా
ప్రకృతిని కాపాడురా
ఆరోగ్యాన్ని పొందురా
హాయిగా జీవించరా
62.
పండుగలంటె మాకిష్టం
చుట్టాలంటె మాకిష్టం
కలిసుంటె మాకిష్టం
వారి ప్రేమ మాకిష్టం
63.
పశువులను బలివ్వకురా
కసాయి తనం మానురా
గోవును ప్రేమించరా
వారితో కలిసుండరా
64.
విద్య నీ సొంత ధనము
ఇతరులకు నీవు పంచుము
విద్యను మరింత పొందుము
మంచి స్థాయిలో ఉండుము
65.
కష్టాన్ని చేయరా
ఫలితాన్ని పొందరా
ధనం సంపాదించరా
అవసరానికి వాడరా

కామెంట్‌లు