రీడర్స్ డైజస్ట్;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  'రీడర్స్ డైజస్ట్' ఒక అధ్బుత ఆంగ్ల మాస పత్రిక. ప్రతి నెల ఎంతో విజ్ఞానాన్ని నింపుకుని వెలువడుతుంది.
        దీనిని 1922 ఫిబ్రవరి 5న డి విల్ వాలెస్,లీలా అచెసన్ వాలెస్ దంపతులు న్యూయార్క్ లో చపాక్ లో ప్రారంభించారు.ప్రపంచ వ్యాప్తంగా ఇది 17 భాషలలో వెలువడుతున్న అధ్బుత పత్రిక. అప్పటిలో వాలెస్ దంపతులు పాఠకులకు ప్రపంచలో ప్రచురితమయ్యే అనేక ఆంగ్ల పత్రికలలోని ఉత్తమ వ్యాసాలు,నిజంగా జరిగిన సంఘటనలు, వైద్యానికి  సంభందించిన వ్యాసాలు ఒక చోట చేర్చి పత్రికను తయారు చేసారు. పెద్ద వ్యాసాలు లేక రచనల్ని కుదించి వాటి అర్థం చెడిపోకుండా ప్రచురించారు.ఆ పద్దతి పాఠకులకు ఎంతో నచ్చింది! అందుకే నెలనెలా దానికి పాఠకులు పెరిగిపోయి సంచికలు ఎక్కువగా ప్రచురించవలసి వచ్చింది.ఈ పత్రిక ప్రపంచ వ్యాప్తంగా 17 భాషల్లో ప్రచురింపబడుతోంది.మన దేశంలో ఆంగ్లంలోనే కాకుండా హిందీలో కూడా ' సర్వోత్తమ్' అనే పేరుతో ప్రచురింపబడుతోంది.
        ఇంచుమించు ప్రపంచవ్యాప్తంగా దీనికి 16మిలియనుల పాఠకులు ఉన్నట్టు అంచనా.
కేవలం కథలు వ్యాసాలే కాకుండా నిజంగా జరిగిన సాహసాలు(drama in real life).ప్రముఖుల సూక్తులు(quotable quotes).ప్రముఖుల మనోభావాలు( points to ponder) . నానార్థాలు(word power).పాఠకుల లేఖల్లో అత్యుత్తమమైన దానికి మంచి బహుమతి ,మంచి జోక్ కి,మిలటరీలో జరిగే హాస్య సంఘటనలు వ్రాసి పంపిస్తే ప్రచురణ జరిగితే మంచి నగదు బహుమతి ఇస్తారు.ఈ బహుమతులు ఒక్కొక్క దానికి వెయ్యి రూపాయల పైనే ఉంటుంది!
       ఇవే కాకుండా 'రీడర్స్ డైజస్ట్' చిత్రకళకు పెద్ద పిట వేస్తున్నది! ప్రతి సంచిక చివరి అట్ట వెనకాల ప్రపంచ ప్రసిద్ధి చెందిన చిత్రకారుల చిత్రాలు ప్రచురించేవారు,మన దేశపు చిత్రకారుల చిత్రాలు కూడా ప్రచురించారు.ఇప్పుడు పత్రిక ఆఖరు పేజీల్లో 'స్టూడియో' పేరుతో అధ్బుత చిత్రాలు,కళాత్మక ఫోటోలు ప్రచురిస్తున్నారు. అమెరికాలో రీడర్స్ డైజస్ట్ ఆఫీసులో అనేక ఉత్తమ చిత్రాలు సేకరించి పెట్టారు. మెదడుకు మేతనిచ్చే 'క్విజ్' కూడా ప్రచురిస్తున్నారు.
      ప్రతినెలా ఆరోగ్య సంబంధమైన వ్యాసాలు నూతన పరిశోధనలతో కూడినవి ప్రచురిస్తున్నారు.
ఇవికాక పతినెలా పత్రికలో నిజంగా జరిగిన సంఘటనలతో కూడిన ఒక అనుబంధ పుస్తకం(bonus read) ఇస్తారు.పుస్తక సమీక్షలు కూడా ఉంటాయి. దాచుకో దగిన పత్రిక.మంచి పేపరు ఉపయోగిస్తారు మనదేశంలో 'ఇండియా టుడే' గ్రూపు వారు దీనిని ప్రచురిస్తున్నారు.దీని సంపాదకుడు అరుణ్ పూరీ.
ఇప్పుడు దీని కార్యాలయం అమెరికాలో మాన్హట్టన్ లో ఉంది.
       ఇప్పుడు ఒక్కొక్క సంచిక ఖరీదు 100 రూపాయలు.సంవత్సరానికి ఒక సారి చందా కడితే సుమారు రెండు వందల రూపాయల రాయితీనే కాక ఓ మంచి పుస్తకం బహుమతిగా పంపుతారు.ఇంత మంచి పుస్తకం పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది.
               ***********

కామెంట్‌లు