*సద్దులబతుకమ్మ*;-బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట చరవాణి:9391097371

 *సీసమాలిక*
ప్రొద్దునలేసియుపూలనుకోసుక
సంచిపట్టుకవెళ్ళు మంచిగాను
చేనుచేనుదిరిగి చేతకొడ‌లిబట్టి
పూలనుదెచ్చిరి పొలతులంత
తట్టలోవేసియు తన్మయత్వముతోడ
మడతబెట్టియుపూలు మనసుతోడ
కత్తెరబట్టియు కత్తిరించిసమంగ
యొక్కచోటనుబెట్టు మక్కువగను
తాంబాలమందున దైవాన్నిగూడియు
కుంకుమపసుపేయు కోర్కెతోడ
గుమ్మడాకునుపేర్చి గునుగు,తంగేడులు
పట్టుగుచ్చులపూలు బంతిపూలు
కట్లపూవులతోడ కాంక్షయు దీరగ
బతుకమ్మనేపేర్చు బాగుగాను
గౌరమ్మనేజేసి ఘనముగామ్రొక్కుచు
వాడలోననుబెట్టి పాటపాడి
ఆడపడుచులంత నందరుకలిసియు
ఆటలాడుకొనునే యవనిలోన
చెరువులోవేసియు స్నేహంగనుండియు
పసుపుపెట్టుకొనును పడతులంత
పులిహోరలుమలీద ఫలహారములపుడు
పంచిపెట్టుకొనును వరములాగ
*తేటగీతి*
గౌరిదేవినిదలచియు గౌరవముగ
యందరొక్కటైజరుపును యందముగను
సద్దులబతుకమ్మనెయెంతొ సంబరముగ
కలిసిమెలిసియు చేసిరి కాంక్షదీర
కామెంట్‌లు