పద్యాలు : -బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట చరవాణి'9391097371
 *ఆటవెలది*
శివునిమెడనపాము చేతత్రిశూలంబు
ఢమరుకంబునూదు ఢమఢమనియు
కరుణజూపినాడు కైలాసమందుండి
లోకరక్షజేయు రూఢిగాను
*తేటగీతి*
పులిదిచర్మంబుధరియించి ముదముగొలుప
శంఖమూదుచునుండెను శంకరుండు
చంద్రవంకనుకలిగియు సౌఖ్యముగను
పాలసంద్రంబులోననె పరమశివుడు
విషమువెడలగ మ్రింగియు వేగిరముగ
దేవతలను రక్షించియు దేవుడయ్యె
*బెజుగాం శ్రీజ*


కామెంట్‌లు
అక్షరారోహాలు చెప్పారు…
శివునిపై పద్యాలు చాలా బాగా రాసావు శ్రీజ అభినందనలు..