@ ఆనందానికి మించిన ఆరోగ్యం, సంతోషానికి మించిన సంపద, సేవకు మించిన స్వర్గం లేవు. సిసిరో
@ ఆరు మౌలిక భయాలు. పేదరికం, విమర్శ, ఆరోగ్యం, తాను ప్రేమించే వ్యక్తిని పోగొట్టుకుంటానని, వృద్ధాప్యం, మరణం.
@ ఆరోగ్యం కోసం, డబ్బుకోసం, స్వార్థాపేక్షల కోసం దేవుణ్ణి పూజించటం భక్తి కాదు.
@ ఆరోగ్యం పోయిన తరువాత గౌరవం, ధనం, మరేదీ సుఖ,సంతోషాలనివ్వలేవు. ఆరోగ్యవంతునికున్న సంతోషం మరెవ్వరికి వుండదు. జాన్ గే
@ ఆరోగ్యం విలువ తెలిసేది అనారోగ్యం లోనే. శంకరాచార్య
@ ఈ రోజు లేవగానే ధన్యవాదాలు చెప్పుకుందాం, ఏదో కొంతనేర్చుకున్నందుకు. కొంచెం కూడా నేర్చుకోకపోతే కనీసం అనారోగ్యం లేనందుకు,ఆరోగ్యం బాగా లేకపోతే చనిపోకుండా బతికిఉన్నందుకు,ధన్యవాదాలు చెప్పుకుందాం.గౌతమ బుద్ధ
@ ఎవరికైతే ఆరోగ్యం బాగుంటుందో వారికి ఆశ వుంటుంది. ఆశ, ఆశయం వున్న వారికి అన్నీ వున్నట్టే.
@ దేహానికి ఆరోగ్యం ఎంత అవసరమో అందానికి ఆత్మ అంతే అవసరం. స్ట్రాంగ్
@ నువ్వు తీసుకునే ఆహారాన్నిబట్టే నీ మనసు, ఆలోచనలు, ఆరోగ్యం.
@ ప్రపంచంలో గొప్ప డాక్టర్లు. ఆరోగ్యం, ఆహారం, విశ్రాంతి, సంతోషం. డిజ్రేలి
సూక్తులు- ఆరోగ్యం- సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414.. peddissrgnt@gmail.com
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి