సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com
 ఇష్టం
@ ఏ పనీ అల్పమైనదికాదు, ఇష్టమైనపనిని మూర్ఖులు కూడా చేస్తారు. ప్రతిపనినీ ఇష్టంగా మార్చుకునే వారే తెలివైనవారు. వివేకానంద
@ ఒక పనిని నిజంగా చేయదలచుకున్న వాడికి ఏదో మార్గం ఉంటుంది, చేయటం ఇష్టం లేని వాడికి ఏదో సంజాయిషీ దొరుకుతుంది.
@ తనకు అప్రియమైనది ఇతరులకు చేయకపోవటమే  ధర్మం అంటారు.   ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటమే అధర్మం. 
@ దేవుడికి బహుశా సాధారణ జనమంటే ఇష్టం వుండి వుండాలి. అందుకే వారినే అసంఖ్యాకంగా తయారు చేసాడు.  లింకన్
@ నువ్వు ఏమి చేయాలనుకునేది నీ ఇష్టంపైన ఆధారపడి ఉంటుంది.
@ నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుండటానికి, అనుభూతులు పొందటానికి/పొందకుండా ఉండటానికి,  పూర్తి స్వేచ్ఛ ఇచ్చే వాడే మిత్రుడు.  
@ ప్రతి మనిషి ఒక గ్రంథం, ఆ గ్రంథాన్ని చదవడం, చదవకపోవడం నీ ఇష్టం. చానింగ్
@ స్వర్గంలో నవ్వడం నిషిద్ధమైతే నాకు స్వర్గం చేరడం ఇష్టం లేదు. మార్టిన్ లూథర్ కింగ్

కామెంట్‌లు