ఊరు@ఊరి ముందర చేను, ఊళ్ళో వియ్యము అందిరావు.
@ఊరి ముందరి చేను వూరపిచ్చుకల పాలన్నట్లు.
@ఊళ్ళో యిల్లు లేదు , పొలంలో చేను లేదు.
@ఎద్దు బీదదయితే చేను బీద.
@ఎరువు పెట్టిన చేను, ఏలుబడి అయిన కోడలు.
@ఎరువు లేని చేను, వేగంలేని ఏరూ ఒకటే.
@ఏటి వొడ్డు చేను ఏరు వస్తే ఉంటుందా?
@కంచె మంచిది కాకపోతే చేను కొల్లబోతుంది.@కంచెలేని చేను, తల్లిలేని బిడ్డ ఒక్కటే.
@చెట్టులేని చేను , చుట్టాలు లేని ఊరు.
@చేను పండినా చేట అప్పే , మొగుడున్నా మొండి మెడే.
@దుక్కికాని చేను తాలింపులేని కూర.
@ నా చేను నీకు రాసిస్తా దున్నుకొని పంట పండిస్తావా? అని అడిగిందట.
సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి