ప్రపంచం-2
@ ప్రపంచం కలలోనైనా తెల్సుకోలేని విషయాలెన్నో ప్రార్థన చేత సాధ్యపడతాయి. టెన్నిసన్
@ ప్రపంచం తియ్యనిది, సస్యశ్యామలది. మహమ్మద్ ప్రవక్త
@ ప్రపంచనడక నవగ్రహాలపై ఆధారపడి లేదు. అది మనలోని రాగద్వేషాలపై ఆధారపడి ఉంది. జిల్లెళ్ళమూడి అమ్మ
@ ప్రపంచం నా దేశం, మంచి చేయడం నా మతం. ధామస్ పీన్
@ ప్రపంచం నుంచి విడిబడి దూరంగా వుండటం మరణంతో సమానమే.
@ ప్రపంచం మనిషి అవసరాలని తీర్చగలదు కానీ కోర్కెలను ఎప్పటికీ తీర్చలేదు.గాంధీజీ
@ ప్రపంచంలో గొప్ప డాక్టర్లు, డాక్టర్ పథ్యం. ఆహారం, డాక్టర్ విశ్రాంతి, డాక్టర్ సంతోషం. డిజ్రేలి
@ ప్రపంచానికి నువ్వు కేవలం ఒక్క వ్యక్తివే కావచ్చు, కాని ఒక వ్యక్తికి నువ్వే ప్రపంచం కావచ్చు. బ్రాండి స్నైడర్
@ బలవంతుల విజయమే ఈ నాగరిక ప్రపంచం. ప్లాటో
@ బాధ్యత తెలిసిన వ్యక్తికి పనే ప్రపంచం. బాధ్యతారహితులకు సోమరులే ఆదర్శం.
@ మనమంతా ప్రేమ భావంతో, సోదర భావంతో నివసించగలిగితే ఈ ప్రపంచం ఆకారాన్ని మార్చి, నూతన ప్రపంచంగా తీర్చిదిద్దవచ్చు.
@ మానవుడు ఒక ప్రత్యేక సృష్టికాదు, జంతుప్రపంచం నుంచి వచ్చిన వాడు మాత్రమే.సిగ్మండ్ ఫ్రాయిడ్
@ మార్పు మనతో మొదలైతే ప్రపంచం అదే మారుతుంది. లియో టాల్ స్టాయ్
@ మార్పుని ప్రపంచం ఎంతగా అసహ్యించుకున్నా, ఆ మార్పువల్లే అణువణువునా అభివృద్ధి సాధ్యపడుతుంది. చార్లెస్ ఎఫ్ కేటరింగ్
@ మిగతా ప్రపంచం అంతా నిన్ను వదలి పోయినప్పుడు నీ దగ్గరకు వచ్చేవాడే నిజస్నేహితుడు. వాల్టర్ వించల్
@ శక్తియుక్తులు గల వారిదే ప్రపంచం. ఎమర్సన్
@ సత్యమే జ్ఞానం, ఈశ్వరుడు, ధర్మం, న్యాయం.సత్యమే సర్వం. సత్యంపైనే చరాచర ప్రపంచం సాంతం వుంది.
@ సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతిరోజూ నూతన ప్రపంచం జన్మించినట్లే. జేమ్స్ ఆర్ లోవెల్
@ సర్వజీవుల యెడల శత్రుత్వం లేని ప్రేమను పెంచుకోండి. బుద్ధుడు చెప్పిన ఈ ఒక మాటను ఆచరిస్తే చాలు, అన్ని అభద్రతా భావాల నుండి ప్రపంచం బయటపడుతుంది. నాదేశం, నా జాతి అనే భావన పోయి విశ్వప్రేమికులమవుతాం. విశ్వదేశీయులం అవుతాం.
సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి