అక్షర సేద్యం చేయాలని -
ఆబగా ఆరంభించా!.
మనోక్షేత్రం పై ఎన్నో ఎన్నెన్నో -
శంకలు పొడసూపాయి.
ఆషాఢ మేఘం అవనితో- దోబూచులాడినట్లుగా, .
భావనామయజీవితం
నాదు భాగ్యమనుకున్నా!
చక్రవత్ భ్రమణంలో చిక్కి
సంక్రమించిన
విషయవాసనల దురాక్రమణే,
మనోచాంచల్యానికి
కారణంగా గుర్తించా! .
విలక్షణమైన విషయా వగాహనకై
వినయంగా మొదలెట్టా. . .
మస్తిష్కపొరల్లొ నిండిన
మిడి మిడి జ్ఞానంతో
అంతా తెలుసు నని మిడిసిపడ్డా!
ఆలోచనలన్నీ వర్షబుతువులో
పంకిలమైన నీరులా ఉన్నాయి,
మనోస్వఛ్ఛతకు శరత్తులోలాంటి -
చంద్రుడు రావాల్సిందే !
విస్తారమైన జ్ఞానానికి
సమస్త ప్రపంచాన్ని -
ఆసాంతాం విలోకించాల్సిందే,
అందుకే అక్షరార్చన
సతతం చేయాల్సిన్దే...!!
*ఆరాటం* ;----డాక్టర్. జానకిరామ శాస్త్రి కుందావజ్ఝల... కరీంనగర్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి