*ప్రేమ*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 111..ప్రేమ "రౌద్రం!"
        క్షణం లో రుద్రావతారం!
        ఆగని శివతాండవం!
        కళ్ళు తెరవడం ఆలస్యం!
        కళ్ళముందే ప్రేమ భస్మం!
112..ప్రేమ"శాంతం!"
        శాంతి నివాసం!
        మధుర దరహాసం!
        ప్రశాంత సావాసం!
        విశ్రాంత సారాంశం!
113.ప్రేమ!
        ఊడిపడ్డ ఉత్పాతం!
        ఊగిపోయే ఉన్మాదం!
        ధరలో అతి దారుణం!
         భయానక "బీభత్సం!"
114.ప్రేమ!
        విత్తు లేని వృక్షం!
        మౌన భాషణం!
        తలుచుకుంటే ఆశ్చర్యం!
        అత్యంత "అద్భుతం!"
115. నవరసాల ప్రేమ!
         అదే మనల్ని బ్రోచే!
         జీవనసాగరతరణనావ!
         నడిచే అసలైన త్రోవ!
            ( కొనసాగింపు)

కామెంట్‌లు
రామానుజం. ప చెప్పారు…
ప్రేమ అనే విత్తులేని వృక్షానికి ,
యెంత శక్తివుందో తెలిపారు ! ధన్యవాదాలు!!