తెలివిగల అల్లుడు!..అచ్యుతుని రాజ్యశ్రీ

 రైతు రామయ్య కూతురు అందగత్తె తెలివితేటలు గలది. ఆమె కోసం తగిన వరుని కంచుకాగడా వేసి వెతికి  గోపి అనే చురుకైన కుర్రాడితో  పెళ్లి జరిపించాడు."ఏమోయ్ గోపి!మీపెళ్లికి నేనెంత ఖర్చు పెట్టానో తెలుసా?"గర్వంగా అడిగాడు రామయ్య. "ఆ!బస్తా బియ్యం!అంతేగా?" అల్లుడి జవాబు విని "ఏంటీ!బస్తా తో వందలాది బంధుమిత్రుల కి భోజనం సరిపోతుందా?"  "అవును మామా!ఎవరైనా  తమ పొట్ట పట్టినంతవరకే తినగలరు.మీరే గొప్పలకి పోయి చాలామంది ని పిలిచారు. బస్తాను మించి తినలేరుగా?"రామయ్య మాట్లాడలేదు. ఒకరోజు వారిద్దరూ పొరుగూరు వెళ్తుంటే  శవం ఎదురైంది. గోపి వెనక నడుస్తున్న వ్యక్తిని అడిగాడు "మాఇంట్లోంచి వస్తోందా?ఇంకా  అలా యాత్రకి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా?"అవ్యక్తి కోపం గా అరిచాడు "నీకు బుద్ధి ఉందా?ఏంటాప్రశ్న?" రామయ్య కూడా గోపీని మందలించాడు."అదికాదు మామా! చనిపోయినవ్యక్తి తన ఇంట్లోవారికి బ్రతికే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాడా లేదా అని నాఉద్దేశం.లేకుంటే ఆకుటుంబంలోనివారు ఆకలితో మాడి చనిపోతారు.అదే నాఉద్దేశం. " 
"చాలుచాలులే!నీ పాండిత్యం ప్రదర్శించకు".  "ఇంకొంచెం దూరం పోగానే కూలీలు పొలం పనులు చేస్తూ కనిపించారు.  "ఏమర్రా! మీచాకిరీ గతసంవత్సరపు పొలంపనులదా?ఈఏటి పంటదా?"గోపి ప్రశ్నకి తెల్లబోయారువారు.రామయ్య విసుగ్గా "ఏంటీ నీతలతిక్క ప్రశ్న?"అరిచాడు.అప్పుడు గోపి కూలీలను ఇలా అడిగాడు  "ఈపొలంపని కూలీ  గత ఏడాది చేసిన  అప్పులు తీర్చటానికా?లేదా అప్పులేకుండా ఈ ఏడాది సుఖంగా మీ జీవితం గడుస్తుందా?"కొందరు కూలీలు ఇలా అన్నారు "బాబూ!మేము  అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇప్పుడు అర్థాకలితో చాకిరీ చేస్తున్నాము.కొందరు పొదుపుగా దాచుకున్నారు.ఇప్పుడు లభించే కూలీతో హాయిగా బతక గలరు."అల్లుడి తెలివితేటలు అర్థం అవటంతో మామ మనసులోనే మెచ్చుకున్నాడు.
కామెంట్‌లు