మా ఊరు
గుర్తుకు రాని క్షణం లేదేమో
అది నా బాల్యం కదా
అంతేనా
అది నన్ను చుట్టుకున్న జీవితంలో
మరుపురాని గొప్ప పాటల తోట ఉన్నది
నా యాత్రలో
ప్రతి అడుగూ నాకు పాఠమైనది
అందరూ నా గురువులే
సంస్కారం నేర్పిన తరువులే
అక్షరాలు రాసిన జీవితం
పుస్తకమైన బోధనలోని జ్ఞాపకం
భావోద్వేగాలు రాగద్వేషాలు అన్నీ
నాలో పెరిగే స్వేచ్ఛా లతలే
నాది ఊరు కదా
మమతానురాగాల గుడిసెలో నేను
గుండె గుండెను తడిమే చెలిమె
ఇక్కడ బంధాలన్నీ తెగని తీగలే
పనీ పాట లయలో ఆటలన్నీ
నా ఊరు నేర్పిన నిత్య గీతాలే
ఓ కవి అన్నట్లు ప్రకృతేగా ఊరంటే
విలువలూ ఆచారాలే ఊరి తంగేడు
మనసంతా ఊరైంది నాలో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి